Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లుకు ఆ ట్విస్ట్ హైలెట్ కానుందా?

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ గురించి క్లారిటీ లేకపోయినా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు పవన్ రోల్ కాకుండా మరో రెండు పాత్రలు హైలెట్ కానున్నాయని సమాచారం అందుతోంది. బాబీ డియోల్ పోషిస్తున్న ఔరంగజేబు రోల్ తో పాటు నర్గీస్ ఫక్రీ పోషిస్తున్న రోషనారా రోల్ ప్రత్యేకంగా ఉండనున్నాయని బోగట్టా.

ఈ పాత్రలకు సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ పాత్రలతో ముడిపడి ఉన్న ట్విస్టులు కూడా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా నిర్మాతలకు విడుదలకు ముందే భారీ స్థాయిలో లాభాలు వస్తున్నాయని సమాచారం.

ఈ సినిమాకు 200 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా ప్రాజెక్ట్ లను ప్రకటించినా హరిహర వీరమల్లుకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే ఈ సినిమా రిలీజ్ కానుండగా సమ్మర్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశం అయితే ఉంది.

హరిహర వీరమల్లు సినిమాపై పవన్ కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. రీఎంట్రీలో పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు సినిమాతో నటుడిగా పవన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో పవన్ తేరి రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమా షూట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus