టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బ్రో సినిమా మరో పది రోజుల్లో రిలీజ్ కానుండగా ఓజీ సినిమా కూడా ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం నుంచి షాకింగ్ అప్ డేట్ వచ్చింది.
ఏపీలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగితే ఎన్నికల సమయానికే ఈ సినిమా పూర్తవుతుందని ఆయన కామెంట్లు చేశారు. అలా జరగని పక్షంలో ఈ సినిమా వచ్చే ఏడాది మొదలవుతుందని ఏఎం రత్నం చెప్పుకొచ్చారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ మారే అవకాశం లేకపోవడంతో హరిహర వీరమల్లు 2024 ఎన్నికలకు ముందే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
తొమ్మిది నెలల్లో పవన్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. చాలామంది హీరోలు రెండు, మూడేళ్లకు ఒక సినిమాను రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం తక్కువ సమయంలోనే మూడు సినిమాలను రిలీజ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. బ్రో సినిమాలో పవన్ ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు అన్నీ ఉన్నాయని ఈ సినిమా (Hari Hara Veera Mallu) పవన్ అభిమానులను నిరాశపరిచే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం ఈ సినిమా దూకుడుకు బ్రేక్ వేయలేమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా పవన్ మార్కెట్ ను మరింత పెంచడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ సినిమాలు వరుసగా రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.