Harish Shankar: హరీష్ శంకర్…’గబ్బర్ సింగ్’ లో అలా.. ‘ఉస్తాద్’ లో ఇలా..!

‘గబ్బర్ సింగ్’ రిలీజ్ అయిన 11 ఏళ్లకు మళ్ళీ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు హరీష్ శంకర్. రెండు రోజుల క్రితమే ఆ చిత్రం షూటింగ్ మొదలైంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ లు కలిసి నిర్మిస్తున్నారు. నిన్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక పోలీస్ స్టేషన్ సెట్‌లో మొదలైంది.

ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌ పై అలాగే ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.‘ఉస్తాద్ ఊచకోత షురూ’ అనే ట్యాగ్ లైన్ ను కూడా జత చేయడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వెనుక కుర్చీలో కూర్చుని టీ గ్లాస్ పట్టుకుని మరో చేతితో గన్ పట్టుకొని ఉన్న వెనుక నుండి తీసినట్టు ఓ ఫోటోని కూడా విడుదల చేశారు. ఈ లుక్ పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఫోటోలో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదని (Harish Shankar) హరీష్ శంకరేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ‘గబ్బర్ సింగ్’ సినిమాలో కూడా నైట్ షూట్ లో హరీష్ పవన్ కళ్యాణ్ లా పోలీస్ డ్రెస్ వేసుకుని ఓ సీన్ లో కనిపిస్తాడు. ‘కెవ్వుకేక..’ పాట పూర్తయ్యాక.. సిద్దప్ప నాయుడు తన ఎం.ఎల్.ఎ సీట్ కోసం డబ్బు అక్రమంగా రవాణా చేస్తుండగా చెక్ పోస్ట్ వద్ద పవన్ కళ్యాణ్ ఉన్నట్టు చూపిస్తారు.

నిజానికి ఆ సన్నివేశంలో కనిపించేది పవన్ కళ్యాణ్ కాదు హరీష్ శంకర్. కనుక ఈసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లుక్ లో కూడా అతనే పవన్ కళ్యాణ్ లా వెనుక నుండి ఫోజు ఇచ్చినట్టు అంతా భావిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus