Harish Shankar: ఆ సినిమాలో ‘గబ్బర్ సింగ్’ కంటే కూడా మాస్ ఎలిమెంట్స్ తక్కువ : హరీష్ శంకర్

  • April 5, 2023 / 01:13 PM IST

2009లో వచ్చిన ‘మగధీర’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగులో మొదటి రూ.100 కోట్ల గ్రాస్ మూవీ ఇదే. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం పునర్జన్మల కాన్సెప్ట్ తో రూపొందింది. రాంచరణ్ ను తిరుగులేని స్టార్ హీరోగా నిలబెట్టింది ఈ చిత్రం. 225 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ చిత్రం. టాలీవుడ్లో అప్పటివరకు రూ.45 కోట్లు బడ్జెట్ పెట్టిన సినిమా లేదు. ఈ సినిమాకి అంత బడ్జెట్ పెడుతున్నారు అంటే అప్పట్లో చాలా మంది టెన్షన్ పడ్డారు.

కానీ అందరి అనుమానాలను ఈ మూవీ పటాపంచలు చేసింది. ఇదిలా ఉండగా.. ఈ మూవీ సీడెడ్ లో రూ.13 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పట్లో అదో రికార్డు. అయితే ఆ తర్వాత 3 ఏళ్లకు వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మూవీ సీడెడ్ లో ‘మగధీర’ కలెక్షన్లను అధిగమిస్తుంది అని అంచనా వేశారు. కానీ ఆ ఫీట్ ను ‘గబ్బర్ సింగ్’ సాధించలేకపోయింది అని ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా సీడెడ్ లో రూ.9.2 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

అయితే ‘గబ్బర్ సింగ్’ సినిమా ‘మగధీర’ కలెక్షన్స్ ను ఎందుకు దాటలేదు అని దర్శకుడు (Harish Shankar) హరీష్ శంకర్ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడితే.. అది ఇంకా పెద్ద మాస్ సినిమా కదా సార్ అన్నాడట. అయితే ఆ తర్వాత వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ‘మగధీర’ కలెక్షన్లను అధిగమించినట్టు కూడా హరీష్ శంకర్ చెప్పాడు.

ఆ సినిమాలో ‘గబ్బర్ సింగ్’ కంటే మాస్ ఎలిమెంట్స్ తక్కువ. అయినా ‘మగధీర’ కలెక్షన్స్ ను బ్రేక్ చేసింది అంటూ హరీష్ శంకర్ చెప్పాడు. కానీ వాస్తవానికి ‘అత్తారింటికి దారేది’ చిత్రం సీడెడ్ లో రూ.11 కోట్ల షేర్ ను మాత్రమే సాధించింది. అంటే ‘మగధీర’ రికార్డ్ బ్రేక్ చేయలేదు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus