Pawan Kalyan: పవన్ అభిమానులకు పండగే అంటున్న హరీష్ శంకర్!

పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో మరో సినిమాగా భవదీయుడు భగత్ సింగ్ ఫిక్స్ అయినా ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వెలువడిందనే సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా ఆగష్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు.

ఒకవైపు హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తూనే మరోవైపు హరీష్ శంకర్ సినిమాలో పవన్ నటించనున్నారని బోగట్టా. పవన్ కళ్యాణ్ ఇందులో లెక్చరర్ గా కనిపించనున్నారని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. పవన్ ను ఈ సినిమాలో కొత్తగా చూపించబోతున్నానని హరీష్ శంకర్ వెల్లడించారు. 1997లో మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ సినిమాలో నటించి ఆ సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. అప్పుడు చిరంజీవి లెక్చరర్ రోల్ లో నటిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లెక్చరర్ రోల్ లో నటిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. పవన్ కాస్ట్యూమ్స్, గెటప్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని హరీష్ శంకర్ తెలిపారు. 10 సంవత్సరాల పాటు ప్రేక్షకులు గుర్తుంచుకునేలా ఈ సినిమాలో డైలాగ్స్ ఉంటాయని హరీష్ శంకర్ అన్నారు.

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుందని హరీష్ శంకర్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. సినిమాసినిమాకు హరీష్ శంకర్ కు క్రేజ్, మార్కెట్ పెరుగుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.