‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా 5 ఏళ్ళ క్రితం మొదలైంది. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా కంప్లీట్ అయ్యింది. కానీ బజ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. థియేట్రికల్ బిజినెస్ కి ఆశించిన ఆఫర్లు రావడం లేదు. క్రిష్ (Krish) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా.. ఆ తర్వాత అతను తప్పుకోవడంతో నిర్మాత ఏ.ఎం.రత్నం తనయుడు జ్యోతి కృష్ణ అలియాస్ రత్నం కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
అతని కెరీర్లో ఒక్క హిట్ కూడా లేదు. అందుకే బయ్యర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ పెట్టి కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో రిలీజ్ కూడా డిలే అవుతూ వచ్చింది. ఏది ఏమైనా జూలై 24న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఓన్ రిలీజ్ రూపంలో అయినా సినిమాని అనుకున్న టైంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.
ఈ క్రమంలో నిన్న ట్రైలర్ లాంచ్ వేడుకని నిర్వహించారు. ఇందులో భాగంగా విడుదల చేసిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ కానీ, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ ఆకట్టుకున్నాయి. పొలిటికల్ సెటైర్స్, హీరోయిన్ గ్లామర్, సనాతన ధర్మం టాపిక్ అన్నీ హైలెట్ అయ్యాయి.
ఈ క్రమంలో బయ్యర్స్ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) థియేటర్ హక్కుల కోసం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఫోన్లు చేస్తున్నారట. దీంతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి.. థియేట్రికల్ డీల్స్ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని నిర్మాత ఏ.ఎం.రత్నం డిసైడ్ అయినట్టు టాక్. అలా ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ ఊపిచ్చిందనే చెప్పాలి.