టాలీవుడ్‌లో హరీష్ శంకర్ (Harish Shankar) సినిమాలపై ఎప్పుడూ ఆసక్తి ఉంటూనే ఉంటుంది. కానీ, ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో, ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఏమిటనే ఉత్కంఠ పెరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) షూటింగ్ రాజకీయ కారణాల వల్ల నిలిచిపోయినప్పటి నుంచి, హరీష్ తన నెక్స్ట్ మూవీపై పూర్తి ఫోకస్ పెట్టినట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం, హరీష్ శంకర్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో (Ram Pothineni) సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు.
చాలా రోజులుగా ఈ కాంబోపై రూమర్స్ వస్తున్నా, ఇప్పుడు అన్ని క్లారిటీ వచ్చాయి. హరీష్ శంకర్ ఒక కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో రామ్‌కు కథ చెప్పగా, ఆ హీరో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సమ్మర్ తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసుకున్న హరీష్ శంకర్, ప్రస్తుతం క్యాస్టింగ్, టెక్నిషియన్స్ ఎంపికలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌ను శ్రీ అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించనున్నారు. ఆయన ఇప్పటికే హరీష్ శంకర్, రామ్ ఇద్దరికీ అడ్వాన్స్ చెల్లించినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రామ్ మరో ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) ఫేమ్ మహేష్ తో (Mahesh Babu P) రామ్ చేస్తున్న సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే హరీష్ శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి, హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను పక్కా చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ లేట్ అయినా, రామ్ తో సినిమాతో హరీష్ మళ్లీ మాస్ మేజిక్ చూపిస్తాడా? అనేది చూడాలి. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోందని సమాచారం.