Harish Shankar, Ravi Teja: రవితేజతో హ్యాట్రిక్‌ సినిమా.. ఎలా ఉంటుందో చెప్పిన హరీశ్‌ శంకర్‌!

రవితేజ, హరీశ్‌ శంకర్‌ ఇదోక ‘షాక్‌’ లాంటి కాంబినేషన్‌. ఇద్దరి జోష్‌ గురించి తెలిసినవాళ్లు.. వీళ్ల కాంబోలో సినిమా వస్తే అదిరిపోతుంది అనుకున్నారు. అయితే ‘షాక్‌’లా వచ్చి ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చారు. ఇదేంటి ఇలా అయిపోయింది అనుకుంటుండగా.. ‘మిరపకాయ్‌’ అంటూ వచ్చి ఘాటైన హిట్‌ కొట్టారు. ఆ విజయం ఎందరికో దారి చూపింది అని కూడా అంటుంటారు. ఇప్పుడు ఈ కాంబోలో హ్యాట్రిక్‌ కోసం చాలామంది వెయిట్‌ చేస్తున్నారు. ఆ వెయిటింగ్‌కి ఎండ్‌ కార్డు పడే రోజు దగ్గర్లోనే ఉంది అంటున్నారు.

‘రావణాసుర’ సినిమా ప్రచారంలో భాగంగా రవితేజ ఇటీవల ట్విటర్‌లో అభిమానులతో ముచ్చట్లు పెట్టారు. వాళ్లు ప్రశ్నలు అడగడం, ఈయన మొక్కుబడి సమాధానాలతో ఆ ముచ్చట్లు అదోరకంగా సాగాయి అనుకోండి. ఆ విషయం పక్కనపెడితే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రవితేజ్‌ ‘ఏమ్మా హరీష్‌.. ఏదో అడుగుతున్నారు నిన్నే’ అని ట్వీట్‌ చేశారు. ఆ ప్రశ్న ఏంటి అంటే.. ‘హరీశ్‌ శంకర్‌తో ఓ సినిమా చేయండి’ అని. దానికి హరీశ్‌ రిప్లై కూడా ఇచ్చారు.

ఆ రిప్లైలో తమ తర్వాతి సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయంలో క్లారిటీ (Harish Shankar) ఇచ్చాడు. ‘‘మా గత సినిమాలకు భిన్నంగా కొత్త సినిమా ఉండనుంది’ అని చెప్పిన హరీశ్‌శంకర్‌.. ‘‘రవితేజ అన్నయ్యతో కలసి పని చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. ఈసారి పీరియాడికల్‌ డ్రామాతో వస్తాం. అతి త్వరలోనే మేం హిస్టరీ రిపీట్‌ చేయబోతున్నాం’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు హరీశ్‌ శంకర్‌. దీంతో ఆయన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

టాలీవుడ్‌లో ప్రస్తుతం పీరియాడిక్‌ సినిమాల హవా నడుస్తోంది అని చెప్పాలి. మొన్నటికి మొన్న నాని ‘దసరా’తో ఇలాంటి సినిమా చేసే హిట్‌ కొట్టాడు. ఇప్పుడు రవితేజ కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థమవుతోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు అనేది చూడాలి. ప్రస్తుతం  హరీశ్‌ శంకర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ పని అయ్యాక రవితేజ సినిమా పనులపై పూర్తి స్థాయిలో దృష్టిపెడతారు అని టాక్‌.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus