విజిల్ వెయ్యటం మీ నుంచే నేర్చుకున్నాను!: హరీష్ శంకర్

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమాలలో అన్ స్టాప్ అబుల్ కార్యక్రమం ఒకటి ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడవ సీజన్లో కూడా ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి అయ్యి ఇటీవల3వ ఎపిసోడ్ కూడా ప్రసారమైంది. ఇక మూడవ ఎపిసోడ్లో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్, సుహాసిని శ్రియ వంటి వారు హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హీరోల వాయిస్ వినపడితే ఆ వాయిస్ ఎవరిది అనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది అయితే ఆన్సర్ చెప్పేటప్పుడు విజిల్ వేసి ఆన్సర్ చెప్పాలి. ప్రభాస్ వాయిస్ వినిపించడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ విజిల్ వేయకుండా ప్రభాస్ అని పేరు చెప్పారు అయినప్పటికీ బాలకృష్ణ మాత్రం విజిల్ వేయకుండా చెప్పడంతో తనని విన్నర్ గా ప్రకటించలేదు.

ఇలా ఆయనను విన్నర్ గా బాలకృష్ణ ప్రకటించకపోవడంతో ఆయన మాట్లాడుతూ అన్యాయం ఎదిరించాలి అన్నప్పుడు మాత్రమే విజిల్ వెయ్యాలి అనే విషయాన్ని నేను మీ నుంచి నేర్చుకున్నాను అంటూ ఈ సందర్భంగా హరీష్ శంకర్ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో బాలకృష్ణ అసెంబ్లీలో విజిల్ వేయడంతో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హరీష్ శంకర్ ఇలాంటి కామెంట్లు చేశారని అర్థమవుతుంది.

ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా సుహాసిని కూడా ఎన్నో విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా బాలకృష్ణతో కలిసి నటించినటువంటి సినిమాల గురించి ఈమె మాట్లాడారు ఈ కార్యక్రమం ఎంతో సరదాగా సాగిపోయింది అయితే హరీష్ శంకర్ విజిల్ గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం పలు చర్చలకు కారణం అవుతున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus