Harish Shankar: మహేష్ విషయంలో మరోసారి తన కోరిక బయటపెట్టిన హరీష్

టాలీవుడ్లో మంచి మాస్ ఇమేజ్ ఉన్న దర్శకుల్లో బోయపాటి శ్రీను (Boyapati Srinu) , హరీష్ శంకర్  (Harish Shankar) ..లు ముందుంటారు. వీళ్లు హీరోలను ప్రజెంట్ చేసే తీరు చాలా బాగుంటుంది. కానీ ఎందుకో వీళ్ళు సినిమా చేయాలి అనుకున్నప్పుడు స్టార్లు అందుబాటులో ఉండరు. బోయపాటి శ్రీను సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆయన రాంచరణ్  (Ram Charan) , ఎన్టీఆర్ (Jr NTR)  , అల్లు అర్జున్ (Allu Arjun) .. వంటి స్టార్లతో సినిమాలు తీసినప్పటికీ, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మహేష్ బాబు (Mahesh Babu)  ..ల వరకు వెళ్లలేకపోయాడు. హరీష్ శంకర్.. ది కూడా సేమ్ సిట్యుయేషన్.

‘షాక్’ తో (Shock)  దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హరీష్ శంకర్, ‘మిరపకాయ్’  (Mirapakay)  తో హిట్ కొట్టడంతో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆ సినిమా హరీష్ శంకర్ ని స్టార్ డైరెక్టర్ ని చేసింది. కానీ ఆ తర్వాత హరీష్ శంకర్ చేసిన ‘రామయ్యా వస్తావయ్యా’ (Ramayya Vasthavayya) ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ (Subramanyam for Sale) ‘దువ్వాడ జగన్నాథం'(డీజే) (Duvvada Jagannadham) , ‘గద్దలకొండ గణేష్’  (Gaddalakonda Ganesh)  వంటి సినిమాలు ‘గబ్బర్ సింగ్’ ని మ్యాచ్ చేయలేకపోయాయి.

మరికొద్ది రోజుల్లో ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హరీష్. దీనికి ముందు పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’  (Ustaad Bhagat Singh)  అనే సినిమాని స్టార్ట్ చేసినా అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీని పరిస్థితి. తర్వాతి సినిమాని రామ్  (Ram)  తో చేయబోతున్నట్టు ప్రకటించాడు హరీష్. అయితే అతనికి స్టార్ హీరోలు దొరకడం లేదు. ముఖ్యంగా హరీష్ కి మహేష్ బాబుతో సినిమా చేయాలనే కోరిక బలంగా ఉంది.

తన కోరికని చాలా సార్లు బయటపెట్టాడు హరీష్. ‘మహేష్ బాబులో  మంచి కామెడీ టైమింగ్ ఉందని, సరిగ్గా దాన్ని వాడితే బాక్సాఫీస్ షేక్ అయిపోతుందని.., మహేష్ తో సినిమా చేస్తే కచ్చితంగా దాన్ని ఎక్కువగా వాడాలని ఆశపడుతున్నట్లు’ హరీష్ శంకర్ తెలిపాడు. తాజాగా ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్స్ లో కూడా తన కోరికని మరోసారి బయటపెట్టాడు. కానీ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో (S. S. Rajamouli)   సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కాబట్టి.. హరీష్ కోరిక ఇప్పట్లో తీరడం కష్టమే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus