సుధీర్ బాబు హీరోగా జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హరోం హర’. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మొదలైన ఈ సినిమా.. ఇప్పుడు రీజనల్ మూవీగానే రిలీజ్ అవుతుంది. టీజర్, ట్రైలర్.. బాగున్నాయి. సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించాయి.సునీల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్. ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉండటం… సుధీర్ బాబుకి మినిమమ్ థియేట్రికల్ మార్కెట్ ఉండటంతో ‘హరోం హర’ కి కొంతలో కొంత బిజినెస్ జరిగింది.
లేట్ చేయకుండా ‘హరోం హర’ థియేట్రికల్ బిజినెస్, అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసుకుందాం రండి :
నైజాం | 2.00 cr |
సీడెడ్ | 1.00 cr |
ఉత్తరాంధ్ర | 1.10 cr |
ఈస్ట్ | 0.25 cr |
వెస్ట్ | 0.20 cr |
కృష్ణా | 0.30 cr |
గుంటూరు | 0.32 cr |
నెల్లూరు | 0.22 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 5.39 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.30 cr |
ఓవర్సీస్ | 0.30 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 5.99 cr (షేర్) |
‘హరోం హర’ చిత్రానికి రూ.5.99 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.6.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే తప్ప.. టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే. మరి ఏమవుతుందో చూడాలి..!