నిశ్శబ్దం కథలో ఆమె పాత్ర కీలకమట

అనుష్క లేటెస్ట్ మూవీ నిశ్శబ్దం. ఏప్రిల్ 2న విడుదల కావాల్సివుండగా కరోనా వైరస్ ప్రభావం కారణంగా వాయిదాపడింది. ఈ చిత్రంలో అనుష్క మొదటిసారి మూగదైన పెయింటింగ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. హీరో మాధవన్ మ్యూజీషియన్ గా నటిస్తుండగా.. అంజలీ ఇన్వెస్టుగేటివ్ అధికారిగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ శాలిని పాండే కీలక రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నిశ్శబ్దం హారర్ థ్రిల్లర్ మూవీ అని అర్థం అవుతుండగా, ట్రైలర్ మరియు టీజర్స్ సినిమాపై అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ మూవీ దాదాపు అమెరికాలోని సియాటిల్ నగరంలో చిత్రీకరించగా, సినిమా కూడా అదే నేపథ్యంలో నడుస్తుంది. యూనివర్సల్ స్టోరీ కావడంతో తెలుగు తో పాటు హిందీ మరియు తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు.

ఊరికి దూరంగా విహారానికి వెళ్లిన ఓ జంటకు ఎదురైన భయానక సంఘటనే ఈ మూవీ కథ అని తెలుస్తుంది. అక్కడ వీరిని అటాక్ చేసిన అదృశ్య వ్యక్తి ఎవరు అనేది సినిమాలో ఆసక్తి కలిగించే అంశం. కాగా హీరోయిన్ షాలిని పాత్రకు ఈ చిత్రంలో చాలా ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తుంది. సోనాలి అనే అనుష్క స్నేహితురాలి పాత్ర ఆమె చేస్తుండగా అదే సినిమాకు కీలకం కానుందని వినికిడి. సినిమా ఆద్యంతం ఆమె పాత్ర అనుమానాస్పదంగా సాగుతుందట. నిశ్శబ్దం మూవీ ద్వారా షాలిని మంచి పాత్ర దక్కించుకున్నట్లు తెలుస్తుంది. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, కోన ఫిల్మ్స్ ఫ్యాక్టరీ, పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus