Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Focus » Pawan Kalyan: బర్త్‌ డే స్పెషల్‌: నటన కాకుండా పవన్‌ కల్యాణ్‌ ఏమేం చేశాడో తెలుసా? లిస్ట్‌ ఇదిగో..!

Pawan Kalyan: బర్త్‌ డే స్పెషల్‌: నటన కాకుండా పవన్‌ కల్యాణ్‌ ఏమేం చేశాడో తెలుసా? లిస్ట్‌ ఇదిగో..!

  • September 2, 2024 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: బర్త్‌ డే స్పెషల్‌: నటన కాకుండా పవన్‌ కల్యాణ్‌ ఏమేం చేశాడో తెలుసా? లిస్ట్‌ ఇదిగో..!

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) .. ఈ రెండు పదాలను అభిమానులు ముద్దుగా PSPK అని పిలుచుకుంటారు. ఆ అక్షరాల సముదాయానికి అర్థం ఏంటో అందరికీ తెలుసు. అదే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) . ఆయనకు అభిమానులు ఇచ్చిన పేరులో పవర్‌లో ఇప్పుడు ఆయన ఉన్నారు. అయితే అంతకంటే ముందే తనదైన పవర్‌తో అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నారనుకోండి. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన నటన కాకుండా చేసిన మిగిలిన పనులు ఓసారి చూద్దాం!

Pawan Kalyan

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) సినిమాతో మొదలైన పవన్‌ కల్యాణ్‌ సినిమా ప్రయాణం ఇప్పుడు లైనప్‌లో మూడు సినిమాలు హోల్డ్‌లో ఉన్నంతవరకు సాగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలల్లో వంద శాతం స్ట్రయిక్‌ రేటుతో 21 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి.. ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయారు. ఇది నటన కాకుండా పర్‌ఫెక్ట్‌గా చేసిన పనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తల్లిని తలచుకుంటూ అభినయ ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?
  • 2 గుడ్లవల్లేరు ఘటనపై పూనమ్ ఎమోషనల్.. కూతురుగా లేఖ రాస్తున్నానంటూ?
  • 3 హేమ కమిటీని స్వాగతిస్తున్న సమంత.. మిగతా హీరోయిన్ల సంగతేంటి?

ఇక సినిమాల్లోనే నటన కాకుండా చేసిన పనులు ఓసారి చూస్తే.. ‘జానీ’ (Johnny) సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా ఫలితం తేడా కొట్టిందనో లేక ఇంకే కారణమో కానీ ఆ తర్వాత డైరక్షన్‌ వైపు రాలేదు. అయితే ‘గుడుంబా శంకర్‌’ (Gudumba Shankar) , ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్’ (Sardaar Gabbar Singh) సినిమాలకు రైటర్‌గా చేశారు. ఈ రెండు సినిమాలూ ఇబ్బందికర ఫలితం అందుకున్నాయి. మళ్లీ ఇటుగా రాలేదు. ఇక నితిన్‌ (Nithiin) ‘ఛల్‌ మోహన్‌ రంగా’ (Chal Mohan Ranga) ను నిర్మించింది పవనే.

ఇక పవన్‌కు బాగా ఇష్టమైన పని.. అదేనండీ స్టండ్‌ కో ఆర్డినేటర్‌ చేసిన సినిమాలు చూస్తే.. ఇప్పుడెందుకు చేయడం లేదు అనిపిస్తుంది. ‘తమ్ముడు’ (Thammudu) , ‘బద్రి’ (Badri) , ‘ఖుషి’ (Kushi) , ‘గుడుంబా శంకర్‌’, ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్’, ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) సినిమాల్లో తన ఫైట్లకు తానే స్టంట్స్‌ కొరియోగ్రఫీ చేసుకున్నాడు. అంతేకాదు చిరంజీవి (Chiranjeevi) ‘డాడీ’ (Daddy) సినిమాలో ఓ ఫైట్‌ను పవవే రూపొందించాడు. అలాగే చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) కి నెరేటర్‌గా గొంతు ఇచ్చాడు.

మాస్‌ సాంగ్స్‌, మాంటేజ్‌ సాంగ్స్‌ పవన్‌ బాగా చేస్తాడు. ఏమన్నా డౌట్‌ ఉందా అయితే ‘ఖుషి’లోని ‘అమ్మాయే సన్నగా..’, ‘గజ్జ ఘల్లు..’ పాటను కొరియోగ్రఫీ, విజువలైజ్‌ చేసిన పవనే అని గుర్తు చేయకతప్పదు. ఇక ‘గుడుంబా శంకర్‌’లో అయితే అన్ని పాటల కొరియోగ్రాఫర్‌ యనే. ‘పంజా’లో (Panjaa) అయితే టైటిల్‌ సాంగ్‌ పవన్‌ క్రియేటివిటీ అని ప్రత్యేకంగా చెప్పాలా?

Panjaa

ఇక పవన్‌కు బాగా నచ్చిన మరో విషయం సంగతి కూడా చూద్దాం. దీంతో పవన్‌ ఆల్‌రౌండ్‌ వర్క్‌ సంగతి కూడా ముగిసిపోతుంది. ‘తాటిచెట్టు ఎక్కలేవు..’, ‘ఏం పిల్లా’ మాట్లాడవా అంటూ.. ‘తమ్ముడు’ సినిమాలో పవన్‌ పాడినప్పుడు మీరు కూడా గొంతు కలిపే ఉంటారు. ఇక ‘ఖుషి’లో ‘బై బయ్యే బంగారు రమణమ్మ..’ అని చుక్కేసి పాటేసుకుంటే మీకు కూడా కిక్‌ ఎక్కే ఉంటుంది.

ఇవన్నీ వదిలేయండి ‘జానీ’లో ‘నువ్వు సారా తాగకురన్నో..’, ‘రావోయి మా ఇంటికి..’ అని గొంతెత్తితే మీరు ఆలోచనలో పడలేదా? సీరియస్‌ పాటల సంగతి కాసేపు పక్కన పెడితే ‘గుడుంబా శంకర్‌’ సినిమాలోని ‘కిల్లి కిల్లి..’ పాటను మీ గల్లీలో వేసుకొని లొల్లి లొల్లి చేసుంటారు కదా. ఇక ‘పంజా’లో మన ‘పాపా రాయుడు..’ పాట అయితే ఫుల్ ఫేమస్‌. అయితే ఇవన్నీ బిట్‌ సాంగ్సే అనుకోండి.

ఫుల్‌ సాంగ్‌ అయితే మాత్రం రెండు సినిమాల్లో పాడి వావ్‌ అనిపించాడు పవన్‌ కల్యాణ్‌. ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi) లో ‘కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా..’ అని అదరగొట్టాడు, బ్రహ్మానందాన్ని బెదరగొట్టాడు. కథలో ఊహించని ట్విస్ట్‌ తనకు తానే ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘అజ్ఞాతవాసి’లో ‘కొడకా కోటేశ్వరరావు..’ అంటూ ఊపున్న సాంగ పాడారు. పవన్‌ కల్యాణ్‌ ఊపు చూసి సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఓ సందర్భంలో షాక్‌ అయ్యాడు కూడా.

ఇలా.. ఒకటి కాదు, రెండు కాదు సినిమాలకు సంబంధించి పవన్‌ చాలా పనులు చేశాడు. ఇందులో పైన మేం చెప్పినవి కొన్ని మాత్రమే. ఎందుకంటే ఆయన చేసే ప్రతి సినిమాలో రచయితకు, దర్శకుడికి తన ఇన్‌పుట్స్‌తో సాయం చేస్తూనే ఉంటాడు. అందుకే ఆల్‌రౌండర్‌ పవన్‌ కల్యాణ్‌ అనేది. ఇన్ని సీన్స్‌, ఫైట్స్‌, సాంగ్స్‌ పెట్టినా కూడా కంప్లీట్‌ అవ్వలేదు, మాకు డౌట్స్‌ తీరలేదు అంటే.. ఓటీటీనో లేదంటే యూట్యూబ్‌నో ఆన్‌ చేయండి.

పైన చెప్పిన అంశంలో ఏదో ఒకటి సెర్చ్‌ చేసి చూడండి సజెషన్స్‌లో ఎన్ని వస్తాయో, మీకు ఎన్ని విషయాలు తెలుస్తాయో. ఇక అసలు మేటర్‌ చెప్పలేదు కదా. ‘హ్యాపీ బర్త్‌ డే పవన్‌ కల్యాణ్‌’. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న వర్షం పరిస్థితుల్లో సంబరాలు వద్దనుకున్నా.. సంవత్సరంలో ఈ రోజు వచ్చేది ఒక్కసారే కదా. అందుకే ఓసారి ఆయన ఆల్‌రౌండర్‌ పనుల గురించి చిన్న సమ్మప్‌ అంతే.

 అభిమానులు అలా పిలిస్తేనే స్టార్ హీరో బాలయ్య ఇష్టపడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Anaganaga Oka Raju Collections: 6వ రోజు కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డ ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 6వ రోజు కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డ ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: 8వ రోజు మరో రికార్డ్ కొట్టిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 8వ రోజు మరో రికార్డ్ కొట్టిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అన్నీ ఓటీటీలోనే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అన్నీ ఓటీటీలోనే

related news

People Media And Pawan Kalyan: అప్పుడెప్పుడో ఇచ్చిన మాట.. ఇప్పుడు షురూ చేయబోతున్న పవన్‌

People Media And Pawan Kalyan: అప్పుడెప్పుడో ఇచ్చిన మాట.. ఇప్పుడు షురూ చేయబోతున్న పవన్‌

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Pawan – Surender: పవన్‌ సినిమా స్టోరీ లైన్‌ ఇదేనా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనా?

Pawan – Surender: పవన్‌ సినిమా స్టోరీ లైన్‌ ఇదేనా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Pawan Kalyan Creative Works: పాత బ్యానర్‌ని బయటకు తీసిన పవన్‌.. ఎవరా హీరో?

Pawan Kalyan Creative Works: పాత బ్యానర్‌ని బయటకు తీసిన పవన్‌.. ఎవరా హీరో?

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

trending news

Anaganaga Oka Raju Collections: 6వ రోజు కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డ ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 6వ రోజు కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డ ‘అనగనగా ఒక రాజు’

3 mins ago
Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

41 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: 8వ రోజు మరో రికార్డ్ కొట్టిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 8వ రోజు మరో రికార్డ్ కొట్టిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

1 hour ago
Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

4 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

7 hours ago

latest news

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

2 hours ago
Boyapati Srinu: బోయపాటి శ్రీను.. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారంటే..

Boyapati Srinu: బోయపాటి శ్రీను.. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారంటే..

2 hours ago
Vennela Kishore: టాలీవుడ్‌లో కొత్త రకం వార్.. వెన్నెల కిషోర్ వర్సెస్ సత్య

Vennela Kishore: టాలీవుడ్‌లో కొత్త రకం వార్.. వెన్నెల కిషోర్ వర్సెస్ సత్య

2 hours ago
Chiranjeevi: మెగాస్టార్ న్యూ ట్రిప్.. నెక్స్ట్ సినిమా కోసం అక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసా?

Chiranjeevi: మెగాస్టార్ న్యూ ట్రిప్.. నెక్స్ట్ సినిమా కోసం అక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసా?

3 hours ago
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన ‘సీతమ్మ’ గురి ఎవరిపై?

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన ‘సీతమ్మ’ గురి ఎవరిపై?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version