బ్లాక్‌బస్టర్‌ల స్ఫూర్తితో వచ్చిన సినిమాలు ఏమయ్యాయో చూశారా.. మరి ‘దసరా’?

  • March 29, 2023 / 12:04 AM IST

ప్రతి శుక్రవారం.. రైటర్‌ మైండ్‌లో కొత్త ఆలోచన అయినా పడుతుంది, లేదంటే స్ఫూర్తి అయినా పుడుతుంది. ఆ వారం వచ్చిన సినిమా చూసి.. ఇలాంటి కథ రాయాలని ఆలోచన అయినా వస్తుంది, ఇంతకంటే మంచి కథ రాసి వావ్‌ అనిపించుకుని, సినిమా ఛాన్స్‌ కొట్టేయాలని ఆలోచనైనా వస్తుంది. అలాగే హీరోల విషయంలోనూ అంతే. ఆ హీరోకు ఇలాంటి కథతో మంచి విజయం వచ్చింది, మనమూ ఒకటి చేద్దాం అనుకుని దర్శకుడితో మీటింగ్‌ పెడతారు. అలా చేసిన కథలు టాలీవుడ్‌లో మిస్‌ ఫైర్‌ అయ్యాయి. అంతేకాదు.. ఆ తర్వాత ఆ దర్శకులు చాలా ఇబ్బందులు కూడా పడ్డారు.

ఈ నెల 30న నాని ‘దసరా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విషయంలో ఎవరెన్ని చెబుతున్నా ‘రంగస్థలం2, ‘పుష్ప’ సినిమాల స్ఫూర్తి ఈ సినిమాలో కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా ఫలితం ఏమవుతుంది అనే చర్చ మొదలైంది. సినిమా ఫలితం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కారణం ఇటీవల వచ్చిన కన్నడ సినిమా ‘కబ్జ’ దారుణ ఫలితమే. ఆ సినిమా ‘కేజీయఫ్‌’ స్ఫూర్తితో తీశారు అనలేం కానీ.. అలాంటి కలరింగ్‌ మాత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇలాంటి ఇబ్బంది పడిన సినిమాలు చూస్తే..

* నిజానికి ఇలాంటి స్ఫూర్తి, ఇబ్బంది అనే కాన్సెప్ట్‌ ‘మగధీర’ నుండే మొదలైంది. ఆ సినిమా విజయం తర్వాత ఆ లుక్‌, నేపథ్యంతో టాలీవుడ్‌లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి ఎన్టీఆర్‌ – మెహర్‌ రమేష్‌ ‘శక్తి’ అయితే, రెండోది అల్లు అర్జున్‌ – వీవీ వినయక్‌ ‘బద్రినాథ్‌’. ఈ రెండూ చేదు ఫలితమే అందించాయి.

* ‘అరుంధతి’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌ ఓరియెంటడ్‌ రోల్స్‌కి కేరాఫ్‌ అడ్రెస్‌ అయిపోయింది అనుష్క. ఆ సినిమా తర్వాత ‘పంచాక్షరి’ అని ఓ సినిమా చేసింది. సముద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇబ్బందికర పరిస్థితుల్ని మిగిల్చింది అని చెప్పాలి.

* రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఎంతటి విజయం అందుకుందో తెలిసిందే. ఆ సినిమా ఎంతోమంది దర్శకులకు కొత్త ఆలోచనలు ఇచ్చింది. ఈ విషయాన్ని మణిరత్నమే చెప్పారు. ఆ సినిమా రాగానే ఇంచుమించు అదే లెక్కలో తమిళనాట ‘పులి’ అనే సినిమా వచ్చింది. బాక్సాఫీసు దగ్గర పిల్లి మాదిరి ప్రదర్శన ఇచ్చి వెళ్లిపోయింది.

* కన్నడ సీమలో సంచలనాలు సృష్టించి ఆ తర్వాత పాన్‌ ఇండియా సినిమా అయిపోయింది ‘కేజీయఫ్‌’. ఈ సినిమా కోవలో ఇటీవల ‘కబ్జ’ వచ్చింది. ప్రచారం బాగా చేయడంతో హైప్‌ వచ్చింది.. కానీ సరైన స్టఫ్‌ లేకపోవడంతో సాదాసీదా సినిమాగా మిగిలిపోయింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus