చిరంజీవికి సినిమా కథ చెప్పి ఒప్పించడం అంత తేలిక కాదు. అంతెందుకు ఆయన కోసం కథ రాయడమే అంత తేలిక కాదు. ఆయన ఇమేజ్, ప్రేక్షకులు, అభిమానుల లెక్కలకు అనుగుణంగా ఉండాలి. ఇక రామ్ చరణ్ విషయమూ అంతే. అలాంటిది ఇద్దరికీ కలిపి ఓ కథ రాయడం, వినిపించి ఓకే చేయించుకోవడం చాలా కష్టం. ఇలాంటి పనే చేసి చూపించారు కొరటాల శివ. అదే ‘ఆచార్య’. మరి ఈ సినిమా కథ ఎలా పుట్టింది, ఆ టైమ్‌లో ఆయన ఆలోచనేంటి?
యాదృచ్చికంగా వచ్చిన ఓ ఆలోచన నుండే ‘ఆచార్య’ కథ పుట్టిందట. చిరంజీవిని చూడగానే ఆచార్య అనే ఫీలింగ్ వస్తుందట కొరటాలకు. మంచి పాత్రలు, మంచి భావోద్వేగాలు కలిసి ‘ఆచార్య’ కథ సిద్ధం చేసుకున్నారట. చిరంజీవితో సినిమా అనుకునే సరికి… చిరు ఎక్కడా కథను ప్రభావితం చేయకూడదు అని అనుకున్నారట కొరటాల. అలాగే ఆయన ఇమేజ్‌కి భంగం కలగకూడదని కూడా అనుకున్నారట. అలా చాలా అంశాల్ని దృష్టిలో పెట్టుకునే ‘ఆచార్య’ సిద్ధం చేశారట.
‘ఆచార్య’ చూసినప్పుడు ఇది ఆయన కోసమే పుట్టిన కథనా అని అనిపిస్తుందట. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా కోసం కత్తిమీద సాము చేశారట కొరటాల. రెండు భిన్నమైన నేపథ్యాల్ని ఎంచుకొని కథని నడపడం సవాల్‌గా అనిపించిందట. ధర్మస్థలి అనే దేవాలయ నగరి.. నక్సలిజం నేపథ్యాన్ని తీసుకొని కథను పూర్తి చేసుకున్నారట కొరటాల. నడిచే బాటలు వేరైనా ధర్మం ముఖ్యం అనే అంశం ఈ కథలో ప్రధానమట.
ప్రాచీన దేవాలయం ఉన్న ధర్మస్థలి అనే ప్రాంతానికి ఓ పెద్ద వ్యక్తి వచ్చి స్థిరపడితే ఎలా ఉంటుందనేది ఈ కథలో ప్రధానమైన అంశమట. అంతేకాదు ‘ఆచార్య’ చూస్తున్నప్పుడు ప్రేక్షకులకి తండ్రి, తనయుడు కనిపించకూడదు అని పక్కాగా ఫిక్స్ అయ్యారట కొరటాల. ఆచార్య, సిద్ధ… రెండూ అద్భుతమైన పాత్రలు. అవి మాత్రమే కనిపించాలి అని అనుకున్నారట. అందుకు తగ్గట్టే కష్టపడి సినిమాను సిద్ధం చేశారట. ఇక సినిమా ఎలా ఉంది అనేది ఏప్రిల్ 29న తెలుస్తుంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!