అమెజాన్ లైనప్ చూశారా..?

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రానున్న రెండు సంవత్సరాలకు గాను మన దేశంలో విడుదల చేయనున్న వెబ్ సిరీస్, సినిమాల వివరాలను వెల్లడించింది. వీటిలో మొత్తంగా 40కి పైగా వెబ్ సిరీస్ లు, సినిమాలు ఉన్నాయి. తెలుగులో కూడా పలు ప్రాజెక్ట్ లను టేకప్ చేసింది అమెజాన్ ప్రైమ్. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘దూత’ వెబ్ సిరీస్ ను ప్రకటించింది అమెజాన్ ప్రైమ్. దీంతో పాటు ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’ అనే వెబ్ సిరీస్, ‘అమ్ము’ అనే సినిమా కూడా తన ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.

Click Here To Watch NOW

‘మోడర్న్ లవ్ హైదరాబాద్’ సిరీస్ లో ఆది పినిశెట్టి, నిత్య మీనన్, రీతూ వర్మ, సుహాసిని మణిరత్నం, రేవతి, నరేష్, మాళవికా నాయర్, బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్, నరేష్ అగస్త్య, కోమలీ ప్రసాద్, ఉల్క గుప్తా నటిస్తున్నారు. నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుదానం దర్శకత్వం వహిస్తున్నారు. ‘అమ్ము’ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చారుకేష్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

దీంతో పాటు ‘మీర్జాపూర్’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3లను ప్రకటించింది. రొమాంటిక్ డ్రామా ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’ సీజన్ 3, ‘మేడ్ ఇన్ హెవెన్’ సీజన్ 2, ‘ముంబై డైరీస్’ సీజన్ 2, ‘పాతాళ్ లోక్’ సీజన్ 2, ‘కామిక్‌స్తాన్’ సీజన్ 3, ‘బ్రీత్: ఇన్‌టూ ది షాడోస్’ సీజన్ 2 కూడా ప్రస్తుతం నిర్మాణంగాలో ఉన్నాయి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే వెబ్ సిరీస్ కూడా నిర్మాణంలో ఉన్నట్లు అమెజాన్ ప్రకటించింది.

ఇందులో శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్, ఇషా తల్వార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలానే కోలీవుడ్ హీరో ఆర్య లీడ్ రోల్ లో ‘ది విలేజ్’ అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.

1

2

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus