Ajith: అజిత్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రష్మిక?

ప్రస్తుత కాలంలో హీరోలు తమ మాతృభాషలోనే కాకుండా పక్క భాషలో కూడా మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది కోలీవుడ్ హీరోలు అలాగే శాండిల్ వుడ్ హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది.ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు ఏకంగా సరాసరి తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో అజిత్ సైతం టాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అజిత్ తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఈయన తాజాగా నటించిన చిత్రం వలిమై. ఈ సినిమాలో అజిత్ టాలీవుడ్ యంగ్ హీరో కార్తీకేయతో గట్టి పోటీ పడ్డారు.ఇలా టాలీవుడ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ సినిమా తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక హీరో కార్తికేయ సైతం తెలుగులో ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ఈ విధంగా తన సినిమాలో టాలీవుడ్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల

తెలుగులో కూడా తన మార్కెట్ పెరుగుతుందని భావించిన అజిత్ తన తదుపరి చిత్రానికి కూడా తెలుగు నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. వలిమై సినిమాలో కార్తికేయతో పోటీ పడగా తన తదుపరి చిత్రం ఏకే 61 లో అజిత్ నటుడు అజయ్ తో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అజిత్ తన 61 వ సినిమాకు గాను హీరోయిన్ రష్మిక ఫైనల్ అయిందని సమాచారం వినపడుతుంది.

అయితే ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇప్పటికే రష్మిక హీరో విజయ్ సరసన వారసుడు సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో అజిత్ సినిమాకి కూడా రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం వినపడుతుంది. అయితే త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలవడునుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus