Aanandham Movie: ఆకాష్ ని సెకండ్ హీరో అనుకున్నాడట.. మెయిన్ హీరో అతనేనట..!

ఇటీవల ‘ఆనందం’ చిత్రం విడుదలై 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దర్శకుడు శ్రీను వైట్ల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ వారికి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. 2001 వ సంవత్సరం సెప్టెంబర్ 28న విడుదలైన ‘ఆనందం’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనిని ఓ క్లాసిక్ అనొచ్చు. ఈ చిత్రంలోని కామెడీ,పాటలు.. ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అయితే ఈ చిత్రం గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శ్రీను వైట్ల.

నిజానికి ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా మొదట ఆకాష్, రేఖ లను అనుకోలేదట. ‘ ‘ఆనందం’ కోసం ముందుగా ఆకాష్ ను హీరోగా అనుకోలేదు. ముందుగా ఉదయ్ కిరణ్ కు ఈ కథని వినిపించాను. అతనికి బాగా నచ్చింది. కానీ అతను ‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ వంటి చిత్రాలకు కమిట్ అవ్వడం వలన డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకున్నాడు.ముందుగా ఉదయ్ ను హీరోగా అనుకున్నప్పుడే ఆకాష్ ను సెకండ్ హీరోగా అనుకున్నాను.

కానీ ఉదయ్ సెట్ కాకపోవడంతో ఆకాష్ ను ‘నిన్నే హీరోగా చేస్తాను వెయిట్ తగ్గమని’ చెప్పాను. అందుకు అతను కూడా చాలా కష్టపడి వెయిట్ తగ్గాడు. దాంతో అతన్ని మెయిన్ హీరోగా చేసి సెకండ్ హీరోగా వెంకట్ ను పెట్టాను. ఇక హీరోయిన్ గా మొదట శ్రీయ ని అనుకున్నాను. కానీ రామోజీరావు గారు ఆమె ‘ఇష్టం’ లో చేస్తుంది వేరే హీరోయిన్ ను చూద్దాం అంటే.. రేఖ ని ఫైనల్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు శ్రీను వైట్ల.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!


హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus