తమిళు స్టార్ హీరోకి ఇప్పుడు అన్ని ఇండ్రస్ట్రీ లో మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండ్రస్ట్రీ లో ధనుష్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే వరుస విజయాలతో మరియు వరుస సినిమాలతో బీజీగా ఉన్న ఈ స్టార్ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది కూడా ఇంతకు ముందు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడి మారి సెల్వారాజుతో చిత్రానికి సిగ్నల్ ఇచ్చాడు ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమా షూటింగ్ లో బీజీగా ఉన్నాడు.
దర్శకుడు అరుణ్ మథేశ్వరన్ తో చేసే పానీ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కెప్టెన్ మిల్లర్ అయిపోగానే హిందీలో ఆనందరాయ్ తో ఓ మూవీ చేయబోతున్నాడని సమాచారం. అలాగే తెలుగులో శేఖర్ కమల్ తో సెల్వారాఘవ డైరెక్షన్ లో యుగానికి ఒక్కడే మూవీకి సీక్వెల్ లో ఇంతకు ముందే ధనుష్ కమిట్ అయినట్లు మనకు తెలిసిన అంశమే. అయితే కెప్టెన్ మిల్లర్ కు ముందే సార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బారీ విజయాన్ని సొంత చేసుకున్నారు.
విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ జీ స్టూడియోస్ సౌత్ మరియు వండర్ బార్ ఫిల్మ్స్ నిర్మించే కొత్త ప్రాజెక్ట్ కోసం వారి బ్లాక్ బస్టర్ మూవీ ‘కర్ణన్’ తర్వాత మరోసారి చేతులు కలిపారు. బ్లాక్ బస్టర్ మూవీ కర్ణన్ రెండవ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రం (Dhanush)ధనుష్ సొంత బ్యానర్ వండర్బార్ ఫిల్మ్స్ చలనచిత్ర నిర్మించబోతున్నట్లు స్వయంగా ధనుష్ తన ట్వీట్టర్ ద్వారా తెలియజేశాడు.
జీ స్టూడియోస్ మరియు వండర్బార్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో విభిన్న పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు మరియు అగ్ర శ్రేణి సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు, వీటికి సంబంధించిన వివరాలు మేకర్స్ త్వరలో ప్రకటిస్తారు. జీ స్టూడియోస్ సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్ అసోసియేషన్ గురించి మాట్లాడుతూ, ” వండర్ బార్ ఫిల్మ్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో భాగం కావడం మాకు చాలా ఆనందంగా మరియు గర్వంగా ఉంది.
ఈ చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ ‘కర్ణన్ ద్వయం ను మరొక్కసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా సంతోషం గా ఉంది. తన బహుముఖ ప్రజ్ఞ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనుష్ మరియు మాస్టర్ క్రాఫ్ట్ మ్యాన్ మారి సెల్వరాజ్ తో కలసి పనిచేయడం మా సంస్థ కి గౌరవం. జీ స్టూడియోస్ లో, ప్రజలను అలరించే మరియు ప్రేరేపించే కంటెంట్ ని రూపొందించడమే మా లక్ష్యం మరియు ఈ చిత్రం అదే రేంజ్ లో నిర్మించబోతున్నాం” అన్నారు.