తమిళ అర్జున్ రెడ్డి ఎవరో తెలుసా?

అర్జున్ రెడ్డి! ఈ సినిమా పేరు వినగానే చాలా ఎగ్సైట్ అయిపోయి మరీ ప్రేక్షకులు ఈ సినిమా చూసేసారు…అయితే ఈ సినిమా ట్రైలర్స్, కాన్సెప్ట్ కొత్తగా అనిపించడంతో ఈ సినిమాను భారీ అంచనాలతో విడుదలయినప్పటికీ అంటే రేంజ్ హిట్ ను కట్టబెట్టారు మన ప్రేక్షకులు…ఇక అదే క్రమంలో ఈ సినిమా హీరో పాత్రలో మెరిసిన విజయ్ దేవరకొండకి సైతం మంచి పేరు వచ్చింది. మరి ఇలా భారీ హిట్ అందుకుని మంచి హాట్ టాపిక్ గా మారిన ఈ సినిమాని వేరే బాషల వాళ్ళు వదులుతారా…లేదుగా…ఈ సినిమాని తమిళంలో తీయాలనే ఆలోచనలో ఉన్నారు తమిళ సినిమా వాళ్ళు…అయితే ఈ సినిమా తమిళంలో తీస్తే ఎవరు తీస్తారు? హీరో ఎవరు అంటే…అక్కడికే వస్తున్నా…ఈ సినిమాపై ఇప్పటికే చియాన్ విక్రమ్ కన్ను పడింది…ఇంతకీ ఈ సినిమా కొంపతీసి విక్రమ్ చేస్తున్నాడా ఏంటి అని కంగారు పడుతున్నారా…ఆ టెన్షన్ ఏమీ లేదు…అసలు విషయం తెలిస్తే మీరే షాక్ అవుతారు…

మ్యాటర్ లోకి వెళితే…విశ్వనటుడు కమల్ హాసన్ తర్వాత ఆ రేంజ్ లో ప్రయోగాత్మక పాత్రల్లో నటించింది ఏకైక హీరో విక్రమ్ ఒక్కడే అంటే అతిశయోక్తి కాదు… ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘చియాన్‌’ విక్రమ్‌ ఇప్పుడు తన తనయుడు ధృవ్‌ ని  హీరోగా పరిచయం చెయ్యబోతున్నారు.  తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవరకొండ విజయ్ నటించిన ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్‌తో ధృవ్‌ హీరోగా పరిచయం కానున్నట్టు స్వయంగా విక్రమ్‌ వెల్లడించడం గమనార్హం. ‘రెడీ టు మేక్‌ ద లీప్‌. ధృవ్‌ టు బి అర్జున్‌రెడ్డి’ అని తనయుడి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో విక్రమ్‌ పోస్ట్‌ చేశారు.  ఎప్పట్నుంచో ధృవ్‌ విక్రమ్‌ ఎంట్రీ గురించి వార్తలొస్తున్నాయి. మొత్తంగా విక్రమ్ ఒక పక్క తన ప్రయోగాలను కొనసాగిస్తూనే మరోపక్క తనయుడి ఎంట్రీ కి సన్నాహాలు చేస్తూ ఉండడం చూస్తూ ఉంటే, ఇండస్ట్రీకి మరో ప్రయోగాత్మక హీరో దొరికినట్లే అన్న సంకేతాలు అందుతున్నాయి…మరి చూద్దాం ఈ చియాన్ తనయుడు…ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తాడో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus