అప్పట్లో గోపీచంద్ సినిమా అంటే మంచి క్రేజ్ ఉండేది. కావాల్సిన కమర్షియల్ ఎలెమెంట్స్ తో పాటూ… యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్ని బాగా అలరించేవి. అయితే రాను రాను… పరిస్థితి మారిపోయింది. కమర్షియల్ సినిమాలకి, కామెడీ సినిమాలకి డిమాండ్ బాగా తగ్గిపోయింది. దీంతో గోపీచంద్ కూడా రేస్ లో వెనుకబడిపోయాడు. ఇప్పుడు గోపీచంద్ మార్కెట్ చాలా డౌన్ అయ్యింది. ‘లౌక్యం’ చిత్రం తప్ప మరో హిట్టు కొట్టలేదు గోపీచంద్. ఎన్నో అసలు పెట్టుకుని చేసిన ‘గౌతమ్ నంద’ ‘పంతం’ చిత్రాలు నిరాశపరిచాయి. ఇప్పుడు గోపిచంద్ తో సినిమా తీయాలి అంటే దర్శక నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.
ఈ క్రమంలో గోపీచంద్ తో సినిమా చేయడానికి అనిల్ సుంకర ముందుకొచ్చాడు. కోలీవుడ్ డైరెక్టర్ తిరుని డైరెక్టర్ గా పెట్టి ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను సెట్ చేసాడు. ఈ ప్రాజెక్ట్ కు మొదట 20 నుండీ 25 కోట్ల వరకూ బడ్జెట్ అనుకున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మార్కెట్ ఇందులోనే సగానికి సగం కూడా లేదు. అయితే విదేశాల్లో షూటింగ్, పెద్ద క్యాస్టింగ్, భారీ యాక్షన్ సీన్లు ఉండడంతో ఈ చిత్రానికి 40 కోట్ల బడ్జెట్ దాటేస్తుందని తెలుస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియని.. అయోమయంలో పడ్డాడట అనిల్ సుంకర. ఈ చిత్రానికి 40 కోట్ల బిజినెస్ జరగడం చాలా కష్టం. గోపీచంద్ గత చిత్రమైన ‘పంతం’ కు 15 కోట్ల బిజినెస్ మాత్ర్రమే జరిగింది. ఈ క్రమంలో పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలంటే చాలా కష్టమే. హీరో మార్కెట్ కి మించిన భారీ బడ్జెట్ తో సినిమాలు రూపొందించి చాలా సార్లు నష్టపోయాడు అనిల్ సుంకర. గతంలో నితిన్ తో ‘లై’ చిత్రానికి కూడా ఇదే స్థాయిలో బడ్జెట్ పెట్టి… తీవ్రంగా నష్టపోయాడు. మరి ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.