Gopichand: జాగ్రత్త పడాలి గోపీచంద్.. లేదంటే కష్టం..!

యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand) నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భీమా'(Bhimaa). మార్చి 8న శివరాత్రి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కన్నడ దర్శకుడు ఎ.హర్ష (Harsha) తెరకెక్కించిన ఈ సినిమా.. మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. రిలీజ్ కి ముందు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. కానీ ఆ తర్వాత ఈ సినిమా బాగానే నిలబడింది. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో మంచి నెంబర్స్ రిజిస్టర్ అయ్యాయి.

రెండో వీకెండ్ ముగిశాక మళ్ళీ తగ్గిపోయాయి. ఏది ఏమైనా మాస్ ఆడియన్స్ లో గోపీచంద్ కి మంచి క్రేజ్ ఉందనేది వాస్తవం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గోపీచంద్ పై గట్టిగానే ఉంది. కానీ అతని లైనప్ చూస్తే.. ‘గోపీచంద్ ఎందుకు ఇలా చేస్తున్నాడు?’ అని అనుకోక మానరు. ప్రస్తుతం అతను శ్రీనువైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని ముందుగా ఓ నిర్మాత ప్రారంభించాడు. కానీ తర్వాత అతను తప్పుకున్నాడు.

దర్శకుడు శ్రీను వైట్ల పై నమ్మకం లేకపోవడం వల్లే అతను తప్పుకున్నాడు అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పై అసలు గోపీచంద్ అభిమానుల్లో కూడా అంచనాలు లేవు అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో ప్లాప్ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ కి (K. K. Radhamohan) ఛాన్స్ ఇచ్చాడు గోపీచంద్. ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) తో ఇతను ఇచ్చిన డిజాస్టర్ మామూలుది కాదు. అయినా గోపీచంద్ పిలిచి మరీ చేస్తున్నాడు. దీంతో ‘జాగ్రత్త పడకపోతే కష్టం గోపి’ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus