డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాలలో కథా కథనాలకు మించి, ఆయన రాసిన డైలాగ్స్, వన్ లైనర్స్ ప్రేక్షకులను వెంటాడతాయి. ఆయన రాసిన అనేక డైలాగ్స్ యూత్ ని తెగ ఆకట్టుకున్నాయి. ఇక జీవిత సత్యాలపై ఆయన రాసే షార్ప్ సెటైర్స్ ప్రతి ఒక్కరికీ తగిలేలా ఉంటాయి. టాప్ డైరెక్టర్ గా జీవితంలో హైట్స్ చూసిన పూరి, ఫెయిల్యూర్స్ తరువాత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. వరుస పరాజయాలతో ఉన్నవన్నీ పోగొట్టుకున్న పూరి, తన చుట్టూ ఉన్న మనుషుల మనస్థత్వాలు, అవకాశవాద తత్వాలు చూశారు.
స్వానుభవం నుండి ఆయన నేర్చుకున్న గుణపాఠాల సారాంశంగా పూరి మ్యూసింగ్స్ పేరుతో కొన్ని సుభాషితాలు సిద్ధం చేశారు. ఈ ఆడియో ఫైల్స్ సంచలనంగా మారాయి. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పూరి చెప్పిన కొన్ని అక్షర సత్యాలను, యంగ్ హీరో కార్తికేయ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పటికైనా పూరి మాటలు విని బుద్దితెచ్చుకోవాలని కోరారు. దాదాపు మూడు నిమిషాల ఆ ఆడియో ఫైల్ లో దేశ పౌరుడిగా ఉంటూ మనం ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంటామో పూరి విపులంగా చెప్పారు.
దేశం కోసం అక్కడ సైనికులు ప్రాణాలు అర్పిస్తున్నారు, కనీసం మనం గోడపై ఉచ్చపోయడం ఆపేద్దాం..అది కూడా దేశ భక్తే అని పూరి చెప్పారు. ఇంత వరకు మనం చేసిన వెధవ పనులు ఓ లిస్ట్ లో రాసుకుని, వాటిని మరలా చేయకుండా జాగ్రత్త తీసుకుందాం అని చెప్పారు.
Most Recommended Video
నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో మెగాహీరోల సందడి..!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?