అంగరంగవైభవంగా నాగశౌర్య అన్న పెళ్లి.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో నాగశౌర్య ఒకరు. ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద, ఛలో, వరుడు కావలెను సినిమాలతో నాగ శౌర్య విజయాలను అందుకున్నారు. నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుంది. నాగశౌర్య బ్రదర్ గౌతమ్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా ఇండస్ట్రీ వాళ్లకు మాత్రం గౌతమ్ బాగానే సుపరిచితం. నాగశౌర్య సినిమాల ప్రమోషన్స్ విషయంలో గౌతమ్ చాలా యాక్టివ్ గా ఉంటారు.

తాజాగా గౌతమ్ నమ్రత గౌడ అనే యువతిని వివాహం చేసుకున్నారు. యూఎస్ లో నిన్న గౌతమ్ నమ్రతల వివాహం గ్రాండ్ గా జరిగింది. గౌతమ్ నమ్రతల పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వివాహ వేడుకకు నాగశౌర్య హాజరు కావాలని ప్రయత్నించినా కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. నాగశౌర్య తన సినిమాకు సంబంధించిన పనుల వల్ల పెళ్లికి హాజరు కాలేకపోయారని సమాచారం. గౌతమ్ నమ్రత కలకాలం సంతోషంగా జీవనం సాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

గౌతమ్ యూఎస్ లో సెటిల్ కావడంతో గౌతమ్ నమ్రతల వివాహం అక్కడే జరిగిందని సమాచారం. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ వివాహ వేడుక జరిగిందని తెలుస్తోంది. గౌతమ్ నమ్రతల పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రేమించి పెద్దలను ఒప్పించి గౌతమ్ నమ్రత గౌడ పెళ్లి చేసుకున్నారని సమాచారం.

సోషల్ మీడియా ద్వారా నాగశౌర్య అభిమానులు గౌతమ్ నమ్రత గౌడలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు నాగశౌర్య కృష్ణ వ్రింద విహారి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఈ సినిమా రిలీజ్ ఆలస్యమవుతుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

1

2

3

4

5

6

7

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!


‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus