Naga Shaurya Wedding: నాగశౌర్య ఇంట మొదలైన పెళ్లి సందడి.. ఫోటోలు చూస్తే వావ్ అనాల్సిందే!

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగశౌర్య ఈ ఏడాది కృష్ణ వ్రింద విహారి సినిమాతో సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. జయాపజయాలకు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న నాగశౌర్య మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైంది. చాలా గ్రాండ్ గా పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా సినీ, రాజకీయ ప్రముఖులు నాగశౌర్య వివాహానికి హాజరు కానున్నారు. నాగశౌర్య పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన పనులు మొదలుకావడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి

. నాగశౌర్యకు కాబోయే భార్య పేరు అనూష శెట్టి నాగశౌర్య అనూష జోడీ బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పెళ్లికొడుకు ఫంక్షన్ తో నాగశౌర్య పెళ్లి పనులు మొదలయ్యాయి. ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో శౌర్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ ఫోటోలు ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఉన్నాయి. నాగశౌర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. శౌర్యకు కాబోయే భార్య అనూషకు బెంగళూరుకు సొంతంగా ఆఫీస్ ఉండగా ఆమె ఫ్యామిలీ బిజినెస్ రంగంలో రాణిస్తోందని బోగట్టా.

అనూష ఇంటీరియర్ డిజైనర్ గా కెరీర్ ను కొనసాగిస్తుండగా తన ప్రతిభతో ఆమె పలు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారని సమాచారం అందుతోంది. శౌర్య అనూషల మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని బోగట్టా. సినిమా రంగానికి చెందిన అమ్మాయిని కాకుండా నాగశౌర్య ఇంటీరియర్ డిజైనర్ ను పెళ్లి చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. నాగశౌర్య త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.

సొంత బ్యానర్ లోనే నాగశౌర్య సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతుండగా ఛలో శౌర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. మరికొన్ని గంటల్లో నాగశౌర్య అనూషల పెళ్లి జరగనుండగా ఈ జోడీ కలకాలం అన్యోన్యంగా జీవనం సాగించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus