Hero Nani: ఆ ఫ్లాప్ సినిమాని హిట్ అంటున్న నాని..!

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో ఉన్న మిడ్ రేంజ్ హీరోల్లో నెంబర్ 1 హీరో. సినిమా కోసం నాని చాలా కష్టపడుతుంటాడు. ఎలాంటి కథనైనా తన నటనతో నడిపించగల సత్తా ఉన్న నటుడు. కాకపోతే వరుస సినిమాలు చేస్తుండడం వల్ల.. మేకోవర్ ఒకేలా ఉంటుందన్న విమర్శలు అతని పై ఉన్నాయి. అలాగే తన సినిమాల గురించి ఓవర్ గా డబ్బా కొట్టుకుంటాడు అనే విమర్శ కూడా నాని పై ఉంది. ఛాన్స్ దొరికితే చాలు తన సినిమా పేరు చెప్పి తెగ డబ్బా కొట్టేసుకుంటూ ఉంటాడు నాని అని కొందరు అభిప్రాయపడుతుంటారు.

సోషల్ మీడియాలో కూడా ఈ అంశం పై డిస్కషన్లు నడుస్తూనే ఉంటాయి. బాలేదని జనాలు తిప్పి కొట్టిన సినిమాని కూడా బాగుంది అంటుంటాడు. బిగ్ బాస్ చేస్తున్నప్పుడు ఓ సందర్భంలో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా బాగుంటుంది టీవీల్లో వచ్చినప్పుడు ‘మీరు కూడా చూడండి’ అని అన్నాడు. నిజానికి అది పెద్ద ప్లాప్ సినిమా. సోషల్ మీడియాలో ఆ సినిమా ఆడలేదు అని నాని కూడా చెప్పుకొచ్చాడు. ఇక ‘టక్ జగదీష్’ సినిమా ప్రమోషన్స్ లో ‘వి’ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు.

‘ఎం.సి.ఎ’ సినిమాకి వచ్చిన రివ్యూలే ‘వి’ కి వచ్చాయి. కానీ ‘ఎం.సి. ఎ’ హిట్ అని చెప్పడానికి కలెక్షన్స్ ఉన్నాయి.. ‘వి’ కి అలాంటి అవకాశం లేదు. సినిమాని ఎక్కువ మంది చూసారు అని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు మాకు ఓ మెయిల్ పెట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు’ అని చెప్పుకొచ్చాడు. ఇక ‘టక్ జగదీష్’ కు కూడా బ్యాడ్ టాక్ వచ్చింది. కానీ ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రమోషన్ల టైంలో ఆ సినిమా కూడా హిట్ అన్నాడు నాని.

ఇక ‘అంటే సుందరానికీ’ ప్రమోషన్లలో భాగంగా తాను ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి నిర్మాణంలో చేసిన గత చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ ని కూడా హిట్ అంటున్నాడు. ‘అద్భుతమైన సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’. నవీన్ గారు, రవి గారు చాలా ప్యాషన్ ఉన్న నిర్మాతలు. ‘గ్యాంగ్ లీడర్’ తో మా జర్నీ మొదలైయింది. ఆ సినిమా మాస్ క్లాస్ అందరినీ ఆకట్టుకుంది.

‘అంటే సుందరానికీ’ కూడా గొప్ప విజయం సాధిస్తుంది’ అని నిర్మాతలు ‘మైత్రి’ వారి గురించి చెబుతూనే పనిలో పనిగా తన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా కూడా మాస్, క్లాస్ ను అలరించింది అన్నాడు. నిజానికి ఆ సినిమా విడుదలైన 2 రోజులకే థియేటర్లు ఖాళీ అయిపోయాయి. ఆ సినిమా వల్ల నిర్మాతలు నష్టపోవడం వల్ల ‘అంటే సుందరానికీ’ సినిమా చేసి పెట్టాడు నాని. అయినా సరే ఆ సినిమా హిట్ అని అన్నాడు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus