‘హిట్ 3’ (HIT3) ట్రైలర్ బయటకు వచ్చింది. అందులో వయొలెన్స్ డోస్ ఎక్కువగానే ఉంది. అందువల్ల ఇది మరింత హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉండగా.. వయొలెన్స్ ఎక్కువగా ఉండే సినిమాలు జనాల్ని తప్పుదోవ పట్టిస్తాయా? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది. ఇటీవల వచ్చిన ‘సూక్ష్మదర్శిని’ (Sookshmadarshini) అనే మలయాళ సినిమాలో చూపించినట్టు ఒక వ్యక్తి తన భార్యను హతమార్చాడు. సో ఇలాంటి ఘోరాలకు సినిమా వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది అనే చర్చ కూడా నడిచింది.
నిన్న ‘హిట్ 3’ ట్రైలర్ లాంచ్ లో నానికి (Nani) ఈ అంశం పై ప్రశ్న ఎదురైంది. దానికి నాని చాలా బ్యాలెన్స్డ్ గా సమాధానం ఇచ్చాడు. నాని మాట్లాడుతూ… “మనకంటే ఎక్స్ట్రీమ్లీ వయొలెన్స్ సినిమాలు తీసే దేశాల్లో మనకంటే చాలా తక్కువ క్రైమ్ రేట్ ఉంది. గూగుల్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.
ఆ దేశాల్లో తీసిన సినిమాల్లో మన సినిమాల్లో కంటే కూడా 10 రెట్లు వయొలెన్స్ ఉంటుంది. మరి అక్కడ క్రైమ్ రేట్ ఎందుకు తక్కువగా ఉంది. సినిమాలు అలాంటి తప్పులు చేయించవు. మన బుద్ధి సరిగ్గా ఉండాలి. ఏ విషయంలో అయినా సరే..! సినిమాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? చెడు చేసిన వాళ్ళందరి ఎండింగ్ చివర్లో దారుణంగా ఉంటుంది.
ధర్మం కోసం నిలబడిన వాడే కదా చివరికి గెలుస్తుంది. ఎవడో ఏదో తప్పు చేసి సినిమా పేరు చెప్పాడు అంటే. అది వాడికి ఒక వంక మాత్రమే. వాడి మైండ్లో ఉన్నది ఎలాగైనా బయటకు వస్తుంది. కారణం సినిమా అని చెబుతున్నాడు అంతే” అంటూ అభిప్రాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది :
మనకంటే ఎక్కువ వయొలెంట్ సినిమాలు తీసే దేశాల్లో క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంది
అలా అనుకునేవాళ్ళకి వేరే సినిమాలున్నాయి#Hit3 #HIT3Trailer #Nani #SaileshKolanu pic.twitter.com/NPa6kggfyl
— Filmy Focus (@FilmyFocus) April 14, 2025