కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో థియేటర్లు మూతబడిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు తగ్గడంతో థియేటర్లు తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా ఏపీలో టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉండటంతో థియేటర్లు తెరవడానికి థియేటర్ల ఓనర్లు ఇష్టపడటం లేదు. నాని గత సినిమా వి ఓటీటీలో రిలీజై ఫ్లాప్ కాగా టక్ జగదీష్ కూడా ఓటీటీలోనే రిలీజ్ కానుండటం గమనార్హం.
ఏకంగా 37 కోట్ల రూపాయలకు ఈ సినిమా ఓటీటీ హక్కులు అమ్ముడయ్యాయి. భారీగా లాభాలు రావడం వల్లే నిర్మాతలు హక్కులను అమ్మేసినట్టు ప్రచారం జరుగుతున్నా కరోనా సెకండ్ వేవ్ వల్ల నిర్మాతలపై వడ్డీ భారం భారీగా పడిందని, థియేట్రికల్ రిలీజ్ విషయంలో అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకోవడం విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని సమాచారం. అనేక ఇబ్బందులు ఎదురవ్వడం వల్లే ఈ సినిమా మేకర్స్ ఓటీటీ డీల్ కు ఓకే చెప్పారు.
అయితే థియేట్రికల్ రిలీజ్ లేకపోవడం వల్ల నిర్మాతలకు పెద్దగా లాభాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో నాని నిర్మాతకు తనకు వీలైనంత సహాయం చేస్తానని చెప్పారని భోగట్టా. నిర్మాత కుదేలైపోతారని ఓటీటీకి అంగీకరించిన నాని ఓటీటీకి ఇవ్వడం వల్ల అదనంగా పోయే డబ్బులకు హామీ ఇవ్వడం గమనార్హం. నాని గొప్ప మనస్సును నెటిజన్లు సైతం మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూడాల్సి ఉంది. నాని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!