Nani: టైర్1 హీరోల జాబితాలో న్యాచురల్ స్టార్.. కానీ?

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దసరా సినిమాతో నాని ఖాతాలో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చేరింది. దసరా సినిమా బడ్జెట్ 70 కోట్ల రూపాయలు కాగా నిర్మాతకు ఈ సినిమా మంచి లాభాలను అందించింది. దసరా సినిమా సక్సెస్ తో టైర్1 హీరోల జాబితాలో దాదాపుగా నాని చేరినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. దసరా మూవీ కథ కొత్త కథ కాదని అయితే దర్శకుడు కొత్తగా చూపించాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కొత్త నేపథ్యంలో కొత్త హంగులతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు తెగ నచ్చేస్తోంది. కలెక్షన్ల విషయంలో దసరా సంచలనాలను సృష్టిస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 32 కోట్ల రూపాయలకు అమ్ముడవగా 60 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు. సీనియర్ స్టార్ హీరోల సినిమాలను మించి ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం.

అయితే నాని భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం ఈ రేంజ్ లో సక్సెస్ సాధిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాని కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం. దసరా సినిమాకు నాని పారితోషికంతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. నాని సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. నాని సినిమాలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.

త్వరలో నాని (Nani) కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. కొత్త డైరెక్టర్లతో వరుస సినిమాలలో నటిస్తూ నాని కెరిర్ పరంగా సత్తా చాటుకున్నారు. నాని ఇతర హీరోలకు సైతం తన సక్సెస్ రేట్ తో అందరినీ ఒకింత ఆశ్చర్యపరుస్తున్నారు. నాని హిట్3 సినిమాలో నటించనుండగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ త్వరలో రానున్నాయి. నాని కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. యంగ్ జనరేషన్ స్టార్స్ కు నాని గట్టి పోటీ ఇస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus