Hero Nani: నాని రేంజ్ పెరిగిందిగా.. స్టార్ హీరోల స్థాయిలో రైట్స్ పలుకుతున్నాయా?

న్యాచురల్ స్టార్ నానికి ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. దసరా సినిమాతో హిట్ టాక్ వస్తే తన సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో నాని మరోసారి ప్రూవ్ చేశారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఈ దర్శకునికి సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు నాని30 మూవీ మ్యూజిక్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

టీ సిరీస్ సంస్థ నాని సినిమా మ్యూజిక్ హక్కులను ఏకంగా 7.1 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని సమాచారం. నాని30 సినిమాతో శౌర్యవ్ అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ నాని విజయాలను అందుకుంటూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. దసరా సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో నాని భవిష్యత్తు ప్రాజెక్ట్ ల హక్కులకు డిమాండ్ ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.

న్యాచురల్ స్టార్ నాని (Nani) తన టాలెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు నాని నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే నాని రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. న్యాచురల్ స్టార్ నాని ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూనే ఆ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

నాని30 బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది. వరుస విజయాలతో నాని స్థాయి మరింత పెరగాలని అభిమానులు సైతం మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. నానికి యంగ్ జనరేషన్ ఫ్యాన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. నాని భవిష్యత్తు ప్రాజెక్ట్ లు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతాయో లేదో తెలియాల్సి ఉంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus