Hero Nani: నాని రేంజ్ పెరుగుతోందిగా.. 100 కోట్ల మార్క్ టచ్ చేశాడా?

  • March 7, 2023 / 04:27 PM IST

న్యాచురల్ స్టార్ నానికి క్రేజ్, మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండగా ఆయన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. నాని దసరా సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 80 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయనే సంగతి తెలిసిందే. లక్నోలో దసరా మూవీ ట్రైలర్ రిలీజ్ కానుందని ఈ నెల 15వ తేదీ లేదా 16వ తేదీన ట్రైలర్ రిలీజయ్యే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత నాని హీరోగా కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో సివిఎమ్ ప్రొడ్యూసర్ గా ఒక సినిమా తెరకెక్కడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 35 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమాకు నాని 22 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా నాని మార్కెట్ ఈ రేంజ్ లో పెరగడంతో ఫ్యాన్స్ సైతం చాలా సంతోషిస్తున్నారు. నాని సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. నాని కొత్త డైరెక్టర్లకు ఎక్కువగా ఛాన్స్ ఇస్తూ సినిమాల బడ్జెట్లు పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు.

నాని కొత్త ప్రాజెక్ట్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు కలిపితే 100 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాని స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని కొంతమంది ఫ్యాన్స్ సూచిస్తున్నారు. నాని మాత్రం ఇతర హీరోలకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. మిడిల్ రేంజ్ హీరోలలో నంబర్ వన్ హీరోగా ఉన్న నాని భారీ సక్సెస్ లను సొంతం చేసుకుంటే మాత్రం నాని రేంజ్ మరింత పెరుగుతుంది.

దసరా సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవడానికి నాని ప్రయత్నిస్తుండగా నాని ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇతర భాషల్లో కూడా నాని సత్తా చాటాలని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus