‘కరోనా టైములో అన్నిటికంటే ముందు థియేటర్లు మూసేశారు, అన్నిటికంటే చివర్లో థియేటర్లు ఓపెన్ చేశారు. అయితే బార్లు, రెస్టారెంట్లకు కొంత సమయం ఇచ్చారు. వాటికంటే థియేటర్లే సేఫ్ కదా. కానీ థియేటర్లని చిన్న చూపు చూస్తున్నారు.. ఎందుకు?. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, టికెట్ రేట్లు మాత్రం తగ్గించమంటున్నారు. సినిమా అనేది ప్రభుత్వానికి చాలా చిన్న సమస్యగా కనిపిస్తోందో ఏమో… కానీ, ఈ రంగం పై కూడా వేలాది కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయి.
నా ‘టక్ జగదీష్’ రిలీజ్ కి ఉంది కదా నేను ఇలా మాట్లాడటం లేదు. బార్లు, రెస్టారెంట్ లు, ఇలా అన్నిటితో సమానంగా థియేటర్లకు కూడా సడలింపులు ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం’ అంటూ నిన్న జరిగిన ‘తిమ్మరుసు’ ప్రీ రిలీజ్ వేడుకలో నాని చెప్పిన మాటలు ఇవి. నిజానికి ఇవి చాలా విలువైన మాటలు కూడా.! ఓ సినిమా అనేది కొన్ని వేల మందికి అన్నం పెడుతుంది. దీని గురించి నాని మాట్లాడినంత ధైర్యంగా పెద్ద హీరోలు, ఇండ్రస్ట్రీ పెద్లలు మాట్లాడలేరా? అనేది ప్రస్తుతం అందరి మదిలో పెదులుతున్న ప్రశ్న. వాళ్ళెందుకు సైలెంట్ గా ఉండిపోయారు. నానికి ఉన్న ధైర్యం వాళ్లకి లేదా…?
నాని సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న మాట నిజమే..! కానీ అతని సినిమాకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. అతనికి ఉన్న మార్కెట్ కు.. ‘టక్ జగదీష్’ ను మంచి రేటుకే ఓటిటి సంస్థలు కొనుక్కుంటాయి. కానీ టికెట్ రేట్ల గురించీ, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యల గురించి కూడా అతను మాట్లాడాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న థియేటర్ల టికెట్ రేట్ల ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు రిలీజ్ కావడం లేదు. ‘వకీల్ సాబ్’ సినిమా టైములో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేసినా ఆ చిత్రం నిర్మాత దిల్ రాజే.. ఆ విషయాన్ని పట్టించుకోలేదు.ఇలాగే ఉంటే.. ఈ ఏడాది పెద్ద సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!