మరో మల్టీ స్టారర్ సెట్ చేయనున్న దిల్ రాజు

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు 2018 వ సంవత్సరం పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ సంవత్సరం దిల్ రాజు నిర్మించిన రాజ్ తరుణ్ ‘లవర్’, నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. రామ్ – అనుపమ కంబినేషన్ లో త్రినాధ్ రావు నక్కిన డైరెక్షన్లో దసరా కానుకగా విడుదలైన ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం పరవాలేదనిపించింది. అయితే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. అయితే 2019 సంక్రాంతికి కానుకగా వస్తున్న వెంకటేష్-వరుణ్ తేజ్ క్రేజీ మల్టీస్టారర్ ‘ఎఫ్2’ అలాగే ఉగాది కానుకగా వస్తున్న మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రాలతో ప్రస్తుతం దిల్ రాజు బిజీగా ఉన్నాడు. వీటితో పాటు మరో ఇంటరెస్టింగ్ కాంబినేషన్ ను దిల్ రాజు సెట్ చేసినట్టు సమాచారం.

వివరాల్లోకి వెళితే ఇటీవల ‘సమ్మోహనం’ చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ తాజాగా దిల్ రాజుకి ఒక మల్టీ స్టారర్ కథను వినిపించగా.. ఆ కథ దిల్ రాజుకు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. ఈ ప్రాజెక్ట్ కు నేచురల్ స్టార్ నాని అలాగే మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ ను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. తాజాగా ఈ ఇద్దరు హీరోలు కూడా ఓకే చెప్పినట్టు టాక్. మరి ఇది ఎంత వరకూ నిజమో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus