మొన్న జరిగిన ‘అంటే సుందరానికి!’ టీజర్ ఈవెంట్లో నాని మాటలు కొంత చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో.. ‘అసలు పాన్ ఇండియా సినిమా అంటే డబ్ చేయకుండా ఒరిజినల్ వెర్షన్ తో పక్క రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి.. అదే నిజమైన పాన్ ఇండియా సినిమా’ అంటూ నాని చెప్పుకొచ్చాడు. నాని సినిమాలకు పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ చేసే నిర్మాతలు లేరనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనే సెటైర్లు వినిపించాయి.
కెరీర్ ప్రారంభం నుండీ నాని తన సినిమా బడ్జెట్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ ఖర్చవ్వకుండా చూసుకుంటూ ఉంటాడు. దాంతో అతని సినిమాకి.. పెట్టింది వచ్చింది అన్నట్టు ఉంటుంది. సరే ఇది అతని పర్సనల్ ఒపీనియన్ కాబట్టి ఎక్కువ విమర్శించకూడదు. అయితే ‘అంటే సుందరానికి!’ చిత్రాన్ని సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో డబ్ చేస్తున్నారు. కానీ ఒక్క కన్నడలో మాత్రం డబ్ చేయడం లేదు. అక్కడి జనాలు తెలుగు సినిమాలను నేరుగా చూడ్డానికి ఇష్టపడతారు కాబట్టి..
అక్కడ డబ్ చేయడం లేదు అంటూ కవర్ చేసాడు నాని. ఈ కామెంట్స్ కన్నడ జనాలను బాధ పెట్టాయి. ‘నాని గారు మీరు అనుకుంటుంది తప్పు. చాలా మంది కన్నడిగులకు తెలుగు, తమిళ భాషలు అర్థం కావు, మీ సినిమాలు చూడాలనుకుంటే తప్పకుండా కన్నడలో డబ్ చేయాల్సిందే’ అంటూ కొంతమంది నెటిజన్లు నాని ని ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెట్టారు. ఇందుకు నాని.. ‘నా అభిప్రాయాన్ని సరిగ్గా వ్యక్త పరచలేకపోయి ఉంటే క్షమించండి. బౌండరీస్ దాటి కన్నడ సినిమా సాధించిన సక్సెస్‌కు గర్వపడుతున్నా’ అంటూ వాటికి వివరణ ఇచ్చాడు నాని.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!