నాని మూవీ నుండి రక్షకుడిని పరిచయం చేస్తున్నారు

  • January 21, 2020 / 04:49 PM IST

నేచురల్ స్టార్ నాని నయా అవతార్ లో రానున్నాడు. ఆయన మొదటిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న సీరియల్ కిల్లర్ గా నటిస్తున్నారు. ‘వి’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని రోల్ గత చిత్రాలకు భిన్నంగా సరికొత్తగా ఉండనుంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. ఐతే ఈ చిత్రంలో హీరో సుధీర్ ఓ కీలక రోల్ చేస్తున్నారు.ఆయన ఓ పోలీస్ అధికారిగా కనిపిస్తారని సమాచారం. కాగా ఈనెల 27న సుధీర్ లుక్ ని పరిచయం చేస్తున్నారట. ‘వి’ చిత్రంలోని ఆయన లుక్ 27న విడుదల చేస్తున్నట్లు సుధీర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

‘రాక్షసుడు ఎదిగిననాడు.. రక్షకుడు ఒకడొస్తాడు, రక్షకుడు వస్తున్నాడు..’ అని ఆయన ఓ ఆసక్తికర కోట్ కూడా ట్విట్టర్ లో పెట్టారు. ఇక్కడ రాక్షసుడు నాని ఐతే, రక్షకుడు సుధీర్ అని అర్థం. నాని-సుధీర్ ల మధ్య ఛేజింగ్ వార్ ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. దాదాపు రేపు పోలీస్ గెటప్ లోని సుధీర్ లుక్ విడుదలయ్యే అవకాశం కలదు. ఈ చిత్రాన్ని మోహన కృష్ణ, ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. నివేదా థామస్ మరియు అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘వి’ మూవీ ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus