టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నిఖిల్ హ్యాపీ డేస్ సినిమాతో గుర్తింపును సంపాదించుకుని యువత, స్వామిరారా, కార్తికేయ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అర్జున్ సురవరంతో యావరేజ్ మూవీని ఖాతాలో వేసుకున్న నిఖిల్ కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరిపోయారు. కృష్ణతత్వంతో తెరకెక్కిన కార్తికేయ2 సినిమా నార్త్ ఆడియన్స్ కు కూడా తెగ నచ్చేసింది.
ఈ సినిమా సక్సెస్ సాధించడంతో కార్తికేయ3 సినిమాను వేగంగా తెరకెక్కిస్తే ఆ సినిమా కూడా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కార్తికేయ2 సినిమా రిలీజ్ కు ముందు నిర్మాతలు నిఖిల్ ను నమ్మి భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించి తప్పు చేశారనే కామెంట్లు వినిపించగా ఈ సినిమా విడుదలైన తర్వాత ఆ అభిప్రాయం పూర్తిస్థాయిలో మారిపోయిందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిఖిల్ 7 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని సమాచారం. కొత్త ప్రాజెక్ట్ ల కోసం నిఖిల్ ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది.
18 పేజెస్ సినిమా సక్సెస్ సాధిస్తే నిఖిల్ రెమ్యునరేషన్ మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. మిగతా హీరోలు రొటీన్ మాస్ మసాలా కథలకు ఓటేస్తుంటే నిఖిల్ మాత్రం భిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటున్నారు. నిఖిల్ ప్రతిభ ఉన్న హీరోలలో ఒకరు కావడంతో పాటు ఈ హీరో మార్కెట్ కూడా పెరగడంతో నిఖిల్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.
సినిమాల విషయంలో వేగం పెంచాలని క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని నిఖిల్ భావిస్తున్నారు. హ్యాపీడేస్ సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో నిఖిల్, తమన్నా మాత్రమే ఇప్పటికీ వరుస ఆఫర్లతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. నిఖిల్ కెరీర్ పరంగా మరింత ఎదిగి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.