Nikhil: నిఖిల్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడు..!

నితిన్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో రూపొందిన ‘సంబరం’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్. కానీ ఆ సినిమాలో అతను నటించాడు అనే విషయం చాలా మందికి తెలీదు. ఎందుకంటే హాయ్.. బాయ్ చెప్పినట్టు ఉంటుంది ఆ సినిమాలో అతని పాత్ర. అయితే ‘హ్యాపీడేస్‌’ చిత్రం అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ చిత్రం తర్వాత నిఖిల్ హీరోగానే కొనసాగుతూ వస్తున్నాడు.ఈ క్రమంలో ‘యువత’ ‘కలవర్ కింగ్’ వంటి పలు యావరేజ్ ఫలితాలను అందుకున్నాడు.

తర్వాత కొన్ని మాస్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసినా అవి అతనికి కలిసి రాలేదు. దీంతో రూటు మార్చి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుండీ అతని సక్సెస్ రేటు పెరిగింది. ‘కార్తికేయ2′ నిఖిల్ ను రూ.100 కోట్ల హీరోగా నిలబెట్టింది. తర్వాత ’18 పేజెస్’ అనే సినిమా చేశాడు. అది యావరేజ్ గా ఆడింది. త్వరలో అతను నటించిన ‘స్పై’ అనే సినిమా రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే రాంచరణ్ ‘వి ప్రొడక్షన్ హౌస్’ లో నిఖిల్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ది ఇండియా హౌస్’ అనే పేరుతో ఈ మూవీ రూపొందనుంది. అలాగే ఠాగూర్ మధు నిర్మాణంలో ‘స్వయంభు’ అనే మూవీ కూడా అచేస్తున్నాడు. ఇప్పటివరకు నిఖిల్ ఒక్కో సినిమాకి రూ.6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ వచ్చాడు.

ఇప్పుడు ఆ నెంబర్ ను పెంచినట్టు తెలుస్తుంది. రూ.8 కోట్ల పారితోషికంతో పాటు అదనంగా లాభాల్లో కొంత వాటా ఇవ్వాలని నిఖిల్ డిమాండ్ చేస్తున్నాడట. అందుకు నిర్మాతలు కూడా ఓకే చెబుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే (Nikhil) నిఖిల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus