ఒక్క పోస్టుతో విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్..!

  • November 18, 2022 / 08:02 PM IST

‘సంబరం’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కు ‘హ్యాపీడేస్‌’ చిత్రం మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆ చిత్రం తర్వాత నిఖిల్ హీరోగానే కొనసాగుతూ వస్తున్నాడు.ఈ క్రమంలో ‘యువత’ ‘కలవర్ కింగ్’ వంటి పలు యావరేజ్ ఫలితాలను అందుకున్నాడు. అయితే ఎప్పుడైతే రూటు మార్చి థ్రిల్లర్ జోనర్ ను టచ్ చేశాడో అప్పటి నుండి సూపర్ హిట్లు నిఖిల్ కు వరిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన ‘కార్తికేయ2’ చిత్రంతో రూ.100 కోట్ల హీరోగా మారిపోయాడు నిఖిల్.

‘కార్తికేయ’ కి సీక్వెల్‌గా వచ్చిన ‘కార్తికేయ-2’ మూవీ హిందీలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘కార్తికేయ-2′ తర్వాత నిఖిల్ ’18 పేజెస్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు ‘స్పై’ అనే మూవీలో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. నిఖిల్ పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరికీ సుపరిచితమే. 2020 లాక్ డౌన్ టైంలో ఇతను పల్లవి వర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పల్లవి వర్మ ఓ డాక్టర్. వీరిది ప్రేమ వివాహం.

అయితే ఈ దంపతులు త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా వాళ్ళ పై ఇలాంటి గాసిప్స్ కామన్ అయినప్పటికీ… ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో వీరు కూడా విడాకులు తీసుకుంటారేమో అనే ఊహాగానాలు మొదలయాయ్యి.

ఈ ఊహాగానాలకు నిఖిల్ ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టాడనే చెప్పాలి. ప్రత్యక్షంగా కాదు కానీ పరోక్షంగా ఈ విషయం పై నిఖిల్ స్పందించాడు. తన భార్యతో ఉన్న ఫోటోని షేర్ చేసి “నీతో కలిసున్న ప్రతి నిమిషం అద్భుతం పల్లవి” అంటూ నిఖిల్‌ కామెంట్‌ పెట్టాడు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus