Nithiin: ఆగష్టులో ఆ ప్లాప్ డైరెక్టర్ తో సినిమా స్టార్ చేస్తున్నాడట..!

యంగ్ హీరో నితిన్ ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా తట్టుకుని నిలబడగల సత్తా ఉన్న నటుడు. ‘సై’ తర్వాత అతను 10 పైనే ప్లాపులు చవి చూశాడు. ఓ దశలో ఇక నితిన్ పనైపోయింది అని అంతా అనుకున్నారు. కానీ ‘ఇష్క్’ చిత్రంతో మళ్ళీ అతను బౌన్స్ బ్యాక్ అయ్యాడు. క్రమంగా మంచి సినిమాలు చేస్తూ తన మార్కెట్ ను పెంచుకున్నాడు. రెండు, మూడు ప్లాప్ లు పడినా.. ఓ బ్లాక్ బస్టర్ కొట్టి దానిని బ్యాలెన్స్ చెయ్యగలడు నితిన్. నిజానికి ‘ఇష్క్’ సినిమా చేస్తున్నప్పుడు… విక్రమ్ కుమార్ కు హిట్లు లేవు.

ఇండస్ట్రీలో కూడా చాలా మంది.. నితిన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ‘ప్లాపుల్లో ఉన్న టైంలో.. ప్లాప్ డైరెక్టర్ తో రిస్క్ అవసరమా’ అని చాలా మంది హెచ్చరించారట. పైగా ఆ చిత్రాన్ని నితిన్ తన సొంత నిర్మాణంలో చేయడంతో మరింత రిస్క్ చేస్తున్నాడు అని అంతా భావించారు. కానీ ఆ చిత్రం హిట్టు కొట్టి నితిన్ కెరీర్ ను మలుపు తిప్పుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, త్వరలో నితిన్.. వక్కంతం వంశీ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఆ డైరెక్టర్ మొదటి చిత్రం ప్లాప్ అయ్యింది. పైగా వంశీ రెండవ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ను చాలా మంది హీరోలు రిజెక్ట్ చేశారు. కానీ నితిన్ దాన్ని ఓకే చేసి.. ఆగష్టు నుండీ సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు.’చెక్’ ‘రంగ్ దే’ వంటి చిత్రాలతో ప్లాపుల్లో ఉన్న నితిన్.. ఈ డేరింగ్ స్టెప్ తో ఎటువంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి..!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus