Nithiin: రాజకీయాల్లోకి రానున్న నితిన్… ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో తెలుసా?

సినిమాలకు రాజకీయాలకు ఎంతో అవినావాభవా సంబంధం ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న సెలబ్రిటీలందరూ కూడా రాజకీయాలలో మంచిగా రానిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు కూడా రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హీరో నితిన్ కూడా రాజకీయాలలోకి రాబోతున్నాయని తెలుస్తుంది. గతంలో ఒకసారి హీరో నితిన్ ను కేంద్రమంత్రి జేపీ నడ్డాభేటీ అయిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో నితిన్ బీజేపీ తరఫున నుంచి ప్రచార కార్యక్రమాలు చేపట్టబోతున్నారని బిజెపికి మద్దతు తెలుపబోతున్నారంటే వార్తలు వస్తున్నాయి. కానీ బీజేపీకి ఏమాత్రం మద్దతు తెలుపలేదని తెలుస్తుంది. నితిన్ రాజకీయాలలోకి వస్తున్నారు కానీ ఈయన మాత్రం ఎక్కడా పోటీకి నిలబడలేదట. నితిన్ మామ అయినటువంటి నగేష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికలలో నిలబడుతున్నారు.

దీంతో ఈయన తన మామయ్యకు మద్దతు తెలపడం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిసిన నగేష్ రెడ్డి ఈయనకు తన సొంత ఊరు అయినటువంటి నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయడం కోసం దాదాపు టికెట్ కూడా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే నగేష్ కోసం (Nithiin) నితిన్ రంగంలోకి దిగారని తన మామయ్య గెలుపు కోసం ఈయన తన వంతు కృషి చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక నితిన్ సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నారు. చివరిగా మాచర్ల నియోజకవర్గం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus