Hero Raja: ఒకప్పటి హీరో రాజా వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్..

  • May 11, 2022 / 04:55 PM IST

ఒకప్పటి టాలీవుడ్ హీరో రాజా అందరికీ గుర్తుండే ఉంటాడు.’ఓ చినదాన’ ‘ఆనంద్’ ‘వెన్నెల’ వంటి పలు హిట్ సినిమాల్లో ఇతను నటించాడు. హీరోగా బోలెడన్ని సినిమాలు చేశాడు కానీ జనాలు ఇతన్ని యాక్సెప్ట్ చేయలేదు. దాంతో పవన్ కళ్యాణ్ ‘బంగారం’, మహేష్ బాబు ‘అర్జున్’ వంటి స్టార్ హీరోల సినిమాల్లో సహాయనటుడిగా చేశాడు. అలా కూడా సక్సెస్ సాధించలేకపోయాడు.దాంతో విలన్ గా కూడా పలు సినిమాల్లో నటించాడు. అలా కూడా నిలబడలేకపోయాడు.

కొన్నాళ్ళకి సినీ పరిశ్రమకి దూరమయ్యాడు. క్రైస్తవ మతం తీసుకుని స్పిరిట్యుయల్ లైఫ్ ను ఆస్వాదిస్తున్నాడు. సరే ఇది తన వ్యక్తిగత విషయం. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇతను సినిమాల పై, సినీ నటుల పై ఇతను నోరు పారేసుకుంటున్నాడు. ఇతను స్పిరిట్యుయల్ మీటింగ్లకి హాజరైనప్పుడు.. ఓ సారి పవన్ కళ్యాణ్ పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. ఆ టైములో ఇతన్ని పవన్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేశారు.

ఇక ఇటీవల ఇతను సినీ పరిశ్రమ పై చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి.అతను మాట్లాడుతూ “శుక్రవారం వచ్చింది కదా. మార్నింగ్ షో.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి చూసెయ్యాలి అంటూ లైన్లో నిలబడి..వెళ్లి మూడు గంటలు టైం వేస్ట్ చేసుకుని సినిమాలు చూస్తారు. దానికి బదులు మీ విలువైన సమయాన్ని మీ అమ్మ నాన్నలతో..

లేదా అక్క చెల్లెల్లతో గడపండి” అంటూ ఇతను కామెంట్స్ చేశాడు. ‘ఇతను చెప్పినట్టు చేస్తే ఇంట్లో రోజు గొడవలే జరుగుతాయి. సినిమా అంటే వినోదం- విజ్ఞానం కూడా..!’ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే రాజా మరీ తీసిపారేసే హీరో అని అనడానికి లేదు. శేఖర్ కమ్ముల, ఇంద్రగంటి మోహన్ కృష్ణ వంటి దర్శకులు ఫేమస్ అయ్యింది కూడా ఇతని సినిమాల వల్లే..!

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus