Rajasekhar: రాజశేఖర్ ఆ ఒక్క విషయాన్ని గమనించడం లేదట..!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఏంటి? పాన్ ఇండియా ఇమేజ్ ను మిస్ చేసుకోవడం ఏంటి? అనే డౌట్ మీకు రావచ్చు. ఈ మధ్య కాలంలో సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ కు పక్క రాష్ట్రాల నుండీ సీనియర్ హీరోలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే టాలీవుడ్లో విలక్షణ నటనకి సరిపడే సీనియర్ హీరోలు చాలా మందే ఉన్నారు. జగపతి బాబు ఈ విషయంలో ముందున్నాడు. శ్రీకాంత్ కూడా బాగానే రాణిస్తున్నాడు.

అయితే ఇప్పుడు అందరి చూపు రాజశేఖర్ పైనే ఉంది. రాజశేఖర్ ఓకె అనాలే కానీ టాలీవుడ్లో రూపొందే పెద్ద ప్రాజెక్టుల్లోకి తీసుకోవడానికి కోట్లకు కోట్లు చెల్లించడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు. ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్ అయితే రాజశేఖర్ కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఆయన మిస్ చేసుకుంటున్నారు అంటూ కామెంట్లు చేశాడు. నిజానికి ‘పిఎస్వి గరుడ వేగ’ చిత్రానికి ముందు రాజశేఖర్.. ‘నాకు విలన్ రోల్స్ సపోర్టింగ్ రోల్స్ చాలా వస్తున్నాయి, అవి చెయ్యను అని నేను చెప్పడం లేదు.

ఇప్పుడు నేను చేస్తే హీరోగా నా పని అయిపోయింది అందుకే అటు వైపు వెళ్తున్నాను అంటారు. అందుకే హీరోగా ఒక హిట్టు కొట్టాక వెళ్తాను’ అంటూ చెప్పుకొచ్చారాయన. ‘పిఎస్వి గరుడ వేగ’ సినిమా క్రిటిక్స్ ను మెప్పించింది. ఆ మూవీకి మంచి రివ్యూలు రేటింగ్ లు వచ్చాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది.

తర్వాత వచ్చిన ‘కల్కి’ పరిస్థితి కూడా అంతే..! ఇప్పుడు రాజశేఖర్ హీరోగా చేసినా.. ఆ సినిమాలు హిట్ అయినా జనాలు చూస్తారు అనుకునే పరిస్థితి లేదు. అదే ఆయన విలక్షణ నటుడిగా మారితే డబ్బుకి డబ్బు, పేరుకి పేరు వస్తుంది. పాన్ ఇండియా వైడ్ ఆయన బిజీ యాక్టర్ అయిపోవచ్చు. ఈ మధ్యనే గోపీచంద్- శ్రీవాస్ సినిమాలో అవకాశం వస్తే ఆయన తిప్పికొట్టారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus