కథల జడ్జిమెంట్ విషయంలో ఎవ్వరూ 100 శాతం కరెక్ట్ అని చెప్పలేము. ఒకవేళ నిజంగా కథ మంచిదైనా దాని మేకింగ్ ఎలా ఉంటుందో అది ఎలా బయటకి వస్తుందో.. దానిని జనాలు రిసీవ్ చేసుకుంటారో లేదో… ఇలా రకరకాల కోణాల నుండీ ఆలోచించాల్సి ఉంది. ఆల్రెడీ హిట్ అయిన కథతోనే ఇంకో సినిమా చేసేస్తే హిట్ వచ్చేస్తుంది అనుకోవడం కూడా తప్పే..! సరిగ్గా మన రాజశేఖర్ కూడా ఇలాంటి తప్పుల్నే చేశారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘చినతంబీ’ చిత్రాన్ని తెలుగులో ‘చంటి’ గా చేశారు.
అయితే మొదట ఈ కథ వెంకటేష్ కంటే ముందు రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్ వంటి హీరోల వద్దకు కూడా వెళ్ళింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారితో ఈ రీమేక్ ను రూపొందించాలని నిర్మాత రామారావు గారు అనుకున్నారు. కానీ రాఘవేంద్ర రావు గారు అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రాజేంద్ర ప్రసాద్ ను పెట్టుకుంటే కామెడీని కూడా జతచేయాల్సి ఉంటుంది. ఇవి పక్కన పెట్టినా ఆ ఇద్దరూ అప్పుడు చాలా బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు చేయలేకపోయారు. తర్వాత రాజశేఖర్ వద్దకు వెళ్ళింది. అతని ఇమేజ్ కు కూడా ఇది మ్యాచ్ అవ్వదు అని పక్కన పెట్టేసాడు.
దాంతో రవిరాజా పినిశెట్టి- వెంకటేష్ లు ఆ మూవీ చేయడం.. అది ఇండస్ట్రీ హిట్ అవ్వడం జరిగింది. అయితే రాజశేఖర్ ఆ సినిమాని వదిలేసి తప్పు చేశాను అనుకున్నాడో ఏమో.. క్రాంతి కుమార్ డైరెక్షన్లో ‘చంటి’ లాంటి కథతోనే ‘అమ్మ కొడుకు’ అనే సినిమా చేసాడు. ఇది ‘చంటి’ కి జిరాక్స్ లా ఉందని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిప్పికొట్టారు. అలా రాజశేఖర్ చంటి సినిమా విషయంలో రెండు విధాలుగా తప్పు చేసినట్టు అయ్యింది.