పూరి కోసం.. రామ్ సాయం..?

రామ్ గత చిత్రాలు ‘హైపర్’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రాలు మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ… కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఇక టాలీవుడ్ లో సక్సెస్ రేట్ ని బట్టి రెమ్యునరేషన్ ఉంటుందనేది తెలిసిన విషయమే. వరుసగా విజయాలు వస్తే రెమ్యునరేషన్ ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. అదే ప్లాప్ వస్తే తన నెక్స్ట్ సినిమాకి తగ్గించుకోవలిసిందే. ప్రస్తుతం రామ్ పరిస్థితి కూడా ఇలానే ఉందట. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు రామ్. ఈ చిత్రాన్ని స్వయంగా.. పూరి జగన్నాథే నిర్మిస్తున్నాడు.

అయితే పూరి కి కూడా ఒక్క హిట్టూ లేదు. దాంతో పూరితో సినిమా చేయడానికి నిర్మాతలు రాకపోవడంతో.. సొంతంగా నిర్మించుకుంటున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు రామ్ కూడా ఈ చిత్రం కోసం తనవంతు సాయం చేయాలనుకుంటున్నాడట. సాధారణంగా రామ్ పారితోషికం రెండున్నర నుండీ మూడు కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు పూరి కోసం రామ్ తన రెమ్యునరేషన్ ని సగానికి సగం తగ్గించుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఒక వేళ సినిమా హిట్ అయ్యి లాభాలు వస్తే అందులో రామ్ కి భాగం ఇవ్వాలని పూరి అనుకుంటున్నాడట. గతంలో ‘టెంపర్’ విషయంలో కూడా ఇదే సీన్ జరిగింది. అప్పటివరకూ ప్లాపుల్లో ఉన్న జూ.ఎన్టీఆర్ , పూరి జగన్నాథ్ లు.. ఆ చిత్రం కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారట. అయితే అప్పుడు బండ్ల గణేష్ నిర్మాత. ఇప్పుడు పూరి నిర్మాత. మరి ఈ చిత్ర ఫలితం ఏమవుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus