Hero Ram: ఇద్దరు హీరోయిన్లతో ఇస్మార్ట్ హీరో రొమాన్స్?

ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని వరుస విజయాలతో జోరుమీదున్నారు. ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల విజయాలు రామ్ కెరీర్ కు ప్లస్ అయ్యాయి. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ఒక సినిమాలో నటిస్తుండగా మెయిన్ హీరోగా కృతిశెట్టి ఎంపికైతే సెకండ్ హీరోయిన్ గా అక్షర గౌడ నటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రామ్ తన సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. అందాల తార అక్షర ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.

తెలుగులో మన్మథుడు2 సినిమాలో నటించిన అక్షర గౌడ ఆ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయినా రామ్ పోతినేని సినిమాతో సక్సెస్ ను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. రామ్ కు విలన్ గా కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి నటిస్తుండగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ నటించిన రెడ్ మూవీ కూడా చాలా భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. అక్షర గౌడ రామ్ కు జోడీ కాదని ఆది పినిశెట్టికి జోడీగా కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమో కాదో తెలియాల్సి ఉంది.

సోషల్ మీడియాలో అక్షర గౌడ యాక్టివ్ గా ఉండటంతో పాటు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ లో అభిమానులను పెంచుకుంటున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమా కొరకు అదిరిపోయే ట్యూన్స్ ను సిద్ధం చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.


Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus