Rishab Shetty: స్టార్ హీరో రిషబ్ శెట్టి సక్సెస్ జర్నీలో ఈ ట్విస్టులు మీకు తెలుసా?

శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుని తర్వాత రోజుల్లో ఇతర భాషల్లో సైతం గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో రిషబ్ శెట్టి (Rishab Shetty)  ఒకరు. కాంతార సినిమా సక్సెస్ తో రిషబ్ శెట్టి పేరు సౌత్ ఇండియా అంతటా మారుమ్రోగింది. బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమాకు ఏకంగా 20 రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి. స్టార్ హీరో రిషబ్ శెట్టి సక్సెస్ జర్నీలో ఉన్న ట్విస్టులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

Rishab Shetty

రిషబ్ శెట్టి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. రిషబ్ శెట్టి ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిస్తే సాధారణ వ్యక్తుల కళ్లు సైతం చెమర్చుతాయి. ఒకానొక సమయంలో రిషబ్ శెట్టి బేకరీలో తిన్న ఆహారానికి 18 రూపాయలు బిల్లు కాగా జేబులో 17 రూపాయలు మాత్రమే ఉండటంతో ఇబ్బందులు పడ్డారు. అప్పుడు రూపాయి లేదని బాధ పడ్డ స్టేజ్ నుంచి ఇప్పుడు తన సినిమాకు జాతీయ అవార్డ్ అందుకునే స్థాయికి రిషబ్ ఎదిగారు.

ఒకానొక సమయంలో రిషబ్ శెట్టి మినరల్ వాటర్ క్యాన్లు అమ్మడం, క్లాప్ బాయ్ గా పని చేయడం చేశారు. 2010 సంవత్సరంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రిషబ్ దర్శకుడిగా కిరిక్ పార్టీ సినిమా సక్సెస్ తర్వాత కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోలేదు. కాంతార సినిమా సక్సెస్ తో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయ్యారు. ఈ సినిమా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది.

రిషబ్ శెట్టి కాంతార2 సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాకు రిషబ్ శెట్టి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. రిషబ్ శెట్టి సక్సెస్ లో ఆయన భార్య ప్రగతి పాత్ర కూడా ఎక్కువగానే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రిషబ్ శెట్టి కెరీర్ పరంగా విజయాలను అందుకుని మరిన్ని సంచలనాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పుట్టిన రోజు నాడు ఆ విషయంపై క్లారిటీ వస్తుందా? చిరు ప్లానేంటో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus