Siddharth: నేను చనిపోతే అలా అనుకోవాలి.. కోరిక చెప్పిన సిద్ధార్థ్‌!

టాలెంట్‌ ఉన్నా.. ఎగ్జిక్యూషన్‌ సరిగా లేక సినిమా ఫలితాలు తేడా కొట్టేస్తుంటాయి. ఆయన ఎంత కష్టపడినా ఫలితాలు మాత్రం సరిగా రావు. అయితే ఆ సినిమాకు అంతకుమించిన ఫలితం రావాల్సింది అని మాత్రం అనిపిస్తుంది. వాటికితోడు ఆయన బయటకు వచ్చాక చెప్పే మాటలు కాస్త పరిస్థితిని సంక్లిష్టం చేసేలా ఉంటాయి. ఆ విషయం వదిలేస్తే.. తాజాగా ఆయన నటించి ‘మిస్‌ యు’ (Miss You) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్‌.రాజశేఖర్ (N. Rajasekar) దర్శకత్వంలో రూపొందిన ‘మిస్‌ యు’ సినిమాలో ఆషికా రంగనాథ్‌ కథానాయిక (Ashika Ranganath) కాగా..

Siddharth

సినిమాను నవంబరు 29న తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వచ్చిన ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. రాబోయే సంక్రాంతి తనకు చాలా ముఖ్యమని, 20 ఏళ్ల కిందట ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తో  (Nuvvostanante Nenoddantana) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చానని గుర్తు చేసుకున్నాడు సిద్ధార్థ్‌ (Siddharth)  . ఈ 20 ఏళ్లు తనకు చాలా ఇచ్చిందని ఆనందంగా చెప్పిన ఆయన.. తాను తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదు అనే విషయాన్ని సినిమాలు తీసే వాళ్లను అడగండి అని అన్నాడు.

ఇక సినిమాల్లో స్టార్‌ అవడం తన డ్రీమ్‌ కాదని, తాను చనిపోతే ‘అరె.. ఒక మంచి నటుడు లేడు’ అనిపించుకోవాలని ఉందని చెప్పాడు. అలాగే ఇకపై ప్రేమ కథలు చేయొద్దని నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అలాగే తాను తెలంగాణ అల్లుడినని, అదితి (Aditi Rao Hydari)  తన దేవత అని కూడా చెప్పాడు. 2024లో తన జీవితంలో జరిగిన మంచి అదితితో పెళ్లే అని మరోసారి చెప్పుకొచ్చాడు.

ప్రతి సినిమా పెద్ద సినిమానే అని, బడ్జెట్‌ ఆధారంగా పెద్ద.. చిన్న.. అని లెక్క పెట్టకూడదని తన సిద్ధాంతం గురించి చెప్పాడు. విడుదలైన వారం తర్వాత థియేటర్‌లో సినిమాతో ఉండాలంటే చాలా విషయాలు జరగాలని, అందులో మొదటిది సినిమా బాగుండాలి అని చెప్పాడు. ఆ తర్వాతే ప్రేక్షకులకు నచ్చాలి అని చెప్పాడు. మరి ‘పుష్ప 2’కి (Pushpa 2: The Rule)  వారం ముందు వస్తున్నారుగా అంటే.. వేరే సినిమాల గురించి వాళ్లే ఆలోచించుకోవాలి అని ఆన్సర్‌ ఇచ్చాడు.

నాని ఫామ్‌ హౌజ్‌.. ఇంట్రెస్టింగ్‌ బ్యాక్‌ స్టోరీ.. ఎందుకు తీసుకున్నాడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus