Nani: నాని ఫామ్‌ హౌజ్‌.. ఇంట్రెస్టింగ్‌ బ్యాక్‌ స్టోరీ.. ఎందుకు తీసుకున్నాడంటే?

సినిమా తారలకు ఫామ్‌ హౌస్‌ ఉండటం అనేది పెద్ద విషయమేమీ కాదు. చాలామందికి ఇలా ఫామ్‌ హౌజ్‌లు ఉన్నాయి. అలాగే నేచురల్‌ స్టార్‌ నానికి కూడా ఓ ఫామ్‌ హౌస్‌ ఉంది. చేవెళ్ల ప్రాంతంలో నానికి ఫామ్‌ హౌజ్‌ ఉంది. అందులో ఓ పెద్దాయన ఉంటారని కొంతమందికి తెలుసు. అయితే అంతకుమించి సమాచారం ఇన్నాళ్లు లేదు. తాజాగా నాని ఓ టాక్‌ షోకి వచ్చినప్పుడు ఈ విషయం ప్రస్తావన వచ్చింది.

Nani

రానా దగ్గుబాటి (Rana Daggubati)  కొత్త టాక్‌ షోకి ఈ వారం నాని  (Nani)  , తేజ (Teja Sajja) , ప్రియాంక అరుళ్‌ మోహన్ (Priyanka Mohan)   వచ్చారు. ఈ క్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అలా నాని ఫామ్‌ హౌజ్‌ గురించి ప్రస్తావన వచ్చింది. ఐదారేళ్ల క్రితం చేవెళ్లలో ఓ ఫాం హౌజ్ కొన్నానని.. అయితే అది రియల్‌ స్టేట్‌ కోసం కాదని, తన తాత కోసమని చెప్పాడు నాని. ఆయనకు నచ్చే వాతావరణాన్ని అక్కడ సృష్టించి పెట్టామని తెలిపాడు నాని.

తన తాతకు 101 ఏళ్లు అని, సిటీ వాతావరణం నచ్చక ఇబ్బంది పడేవారని, సిటీలో ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉండేవారని చెప్పుకొచ్చాడు. ఒకానొక సమయంలో అందరి పేర్లు మరచిపోయే పరిస్థితిలోకి వచ్చారని.. దీంతో పరిస్థితి చేయి దాటకుండా తాతను ఫామ్‌ హౌస్‌లో పూర్తి స్థాయిలో గ్రామ నేపథ్యం సృష్టించి అక్కడ పెట్టామని చెప్పాడు. ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో కోలుకొని హ్యాపీగా ఉన్నారని చెప్పాడు.

ఆ ఫామ్‌ హౌస్‌లో గోశాల పెట్టుకున్నామని.. అక్కడి ఆవులకు తన తనయుడు జున్నునే పేరు పెడతాడని చెప్పాడు నాని. అలా తన గోశాలలోని ఆవులకు భీమ్‌, రాధ, కృష్ణ, లక్ష్మీ పేర్లు పెట్టాడని చెప్పాడు. అన్నట్లు యువ హీరో తేజ సజ్జా తన రెమ్యూనరేషన్‌తో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నా అని చెప్పాడు. అసలు ఈ టాపిక్‌ వచ్చినప్పుడు నాని ఫామ్‌ హౌజ్‌ టాపిక్‌ డిస్కషన్‌లోకి వచ్చింది.

ఆ తమిళ దర్శకుడు వచ్చింది బన్నీ కోసమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus