‘బాద్ షా’ తర్వాత సిద్దార్థ్ తెలుగు సినిమాల్లో నటించడానికి చాలా టైం తీసుకున్నాడు. అలా 8 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘మహా సముద్రం’ అనే సినిమా చేశాడు. శర్వానంద్ ఈ సినిమాలో మెయిన్ హీరో కాగా సిద్దార్థ్ సెకండ్ హీరోగా నటించాడు. ‘ఆర్.ఎక్స్.100’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో అప్పట్లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ 2021 అక్టోబర్ 14న రిలీజ్ అయిన ఈ సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది. నిర్మాత అనిల్ సుంకర ఇది మిడ్ రేంజ్ సినిమా అని చూడకుండా..
భారీగా ఖర్చు పెట్టాడు. క్యాస్టింగ్ కూడా బాగా కుదిరింది. (Siddharth) సిద్ధార్థ్ కి ఈ సినిమా కోసం రూ.8 కోట్లు పారితోషికం ఇచ్చారు. తమిళ డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ ఎక్కువ రేట్లకు వెళ్తాయని ఆశించారు. ప్రీ రిలీజ్ వేడుకలో కూడా హీరో శర్వానంద్ కంటే సిద్దార్థ్ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. కానీ అతని అంచనాలు అన్నీ తారుమారైపోయాయి. చాలా రోజుల తర్వాత ఈ సినిమా రిజల్ట్ పై సిద్దార్థ్ నోరు విప్పాడు. సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ” ‘మహా సముద్రం’ ఇప్పటికీ నా ఫేవరెట్ మూవీ.
కానీ సినిమా జనాలకి కనెక్ట్ అవ్వలేదు. స్నేహితుడి ప్రేయసిని హీరో పెళ్లి చేసుకోవడం ప్రేక్షకులకు నచ్చలేదు, అందుకే జనాలు కనెక్ట్ కాలేదు. ఆ సినిమాకి వంద మంది పని చేస్తే వందమందీ కూడా ఇది సూపర్ హిట్ అని బలంగా నమ్మారు. కానీ ఫలితం అలా రాలేదు. అలా అని అది తప్పుడు సినిమా కాదు. ఇప్పటికీ అజయ్ భూపతితో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తను గొప్ప టెక్నీషియన్. ఆర్.ఎక్స్ 100కి మించిన సినిమాలు తన నుంచి చాలా వస్తాయి.
నాతో కొంతమంది ‘ఇంకో పది ఏళ్ల తరవాత రావాల్సిన సినిమా ఇది.. ముందే తీసేశారు..’ అంటూ ఉంటారు. అలాంటి మాటల్ని నేను నమ్మను. ఇప్పుడు – ఈ టైమ్‌లో ప్రేక్షకులకు నచ్చిందా? లేదా? అనేదే ముఖ్యం. నా ‘చుక్కల్లో చంద్రుడు’ సినిమా ఫ్లాప్ అయ్యింది. కానీ కొంతమందికి అది నచ్చింది. పదేళ్ల తరవాత తీయాల్సింది అనే మాటలు వింటుంటే నవ్వాలో, ఏడ్వాలో కూడా నాకు అర్థం కాదు” అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు