Siddharth: రియల్ లైఫ్ ప్రేమ గురించి ప్రశ్నించిన రిపోర్టర్… షాకింగ్ సమాధానం చెప్పిన హీరో!

నటుడు సిద్ధార్థ్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన టక్కర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్లో కూడా ఈయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ ఈయన వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు వేశారు. సిద్ధార్థ ఇదివరకు పలువురు హీరోయిన్లను ప్రేమించిన సంగతి మనకు తెలిసిందే..

అయితే ప్రస్తుతం ఈయన నటి అదితి రావు హైదరితో ప్రేమలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల గురించి పలుమార్లు వీరిని ప్రశ్నించిన సరైన సమాధానం చెప్పకపోవడమే కాకుండా ఆ ప్రశ్నను దాటవేస్తున్నారు. అయితే వీరిద్దరూ జంటగా కలిసి ముంబై వీధులలో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కుతున్నారు. ఇలా అదితి రావు హైదరి సిద్ధార్థ్ డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి.

అయితే తాజాగా ఈయన టక్కర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి ఈయన వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా రిపోర్టర్ హీరోని ప్రశ్నిస్తూ మీరు రీల్ లైఫ్ లో లవ్ లో సక్సెస్ ఫుల్ హీరో అయ్యారు కానీ రియల్ లైఫ్ లో మాత్రం లవ్ లో సక్సెస్ కాలేకపోయారు. అది మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు (Siddharth) సిద్ధార్థ్ సమాధానం చెబుతూ…మళ్లీ ఇలాంటి కామెంట్రీ అద్దం చూసి గాని నిద్రపోతున్నప్పుడు కానీ నా మైండ్ లో అసలు రాలేదు. కానీ రియల్ లైఫ్ లో నేను ఎలా ప్రేమిస్తున్నాను అనే విషయం గురించి మీరు మాత్రమే ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ విషయం గురించి మీరు నేను పర్సనల్ గా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ తన స్టైల్ లో సమాధానం చెప్పారు. ఇక ఈ విషయం వీరందరికీ అసలు అవసరం లేదని, టక్కర్ సినిమాకు ఏమాత్రం సంబంధంలేని విషయం అంటూ ఈయన కాస్త ఘాటుగా సమాధానం చెప్పారు..

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus